వీళ్లు ఉపవాసం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న వైద్యులు..?

మనం జీవితంలో ఎంత సంపాదించినా, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథానే. మారుతున్న కాలంతో మనిషి డబ్బు వెంట పరుగుపెడుతున్నాడు. ఈ ప్రయాణంలో మనిషి తిండి, నిద్ర లాంటి ప్రాథమిక విషయాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే జీవనం సాగిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల అసిడిటీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. Also Read: బతికి ఉండగానే హీరోయిన్ ను […]

Written By: Kusuma Aggunna, Updated On : October 5, 2020 10:55 am
Follow us on

మనం జీవితంలో ఎంత సంపాదించినా, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథానే. మారుతున్న కాలంతో మనిషి డబ్బు వెంట పరుగుపెడుతున్నాడు. ఈ ప్రయాణంలో మనిషి తిండి, నిద్ర లాంటి ప్రాథమిక విషయాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే జీవనం సాగిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల అసిడిటీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

Also Read: బతికి ఉండగానే హీరోయిన్ ను చంపేశారు !

మరి కొంత మంది దేవునిపై భక్తి వల్లో లేదా బరువు తగ్గాలనో రోజంతా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఇలా రోజంతా ఉపవాసం చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మనం ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా అంత మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. పోషక నిపుణులు సైతం మనం రోజూ తినే ఆహారంపైనే ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు. ఉపవాసం ఎన్నో జబ్బుల బారిన పడటానికి పరోక్షంగా కారణమవుతుంది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొందరు మాత్రం ఉపవాసానికి దూరంగా ఉంటే మరీ మంచిది. పిల్లలు, అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్న యువతీయువకులు, గర్భిణులు ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదు. మధుమేహ రోగులు సమయానికి ఆహారం తీసుకోకపోతే శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. చివరికి ప్రాణాంతకం అవుతుంది.

Also Read: బాలయ్య కోసం వారణాసి ప్రయాణం !

ఎవరైనా ఆహారం ద్వారా బరువు తగ్గాలని భావిస్తే తినడం పూర్తిగా మానేయకుండా డైటీషియన్ సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉపవాసం చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నా లాభాలతో పోలిస్తే నష్టాలు ఎక్కువగా ఉంటాయని అందువల్ల సమయానికి ఆహారం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.