https://oktelugu.com/

Turmeric : పసుపు ఆరోగ్యానికి మంచిదే అని అధికంగా వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్లే!

దీనివల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటు కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బాడీలో ఐరన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది రక్తహీనతను పెంచుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో మాత్రమే పసుపు వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 18, 2024 / 05:04 AM IST

    Turmeric

    Follow us on

    Turmeric  : ప్రతి కూరల్లో తప్పనిసరిగా పసుపు వాడుతారు. ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అందాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన కూడా ఏ పదార్థాన్ని అయిన కాస్త లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పసుపు యాంటీ బయోటిక్ ఆరోగ్యానికి మంచిదని కొందరు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. కానీ అధికంగా పసుపును వినియోగించడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ఆరోగ్యానికి మంచిది అయిన కూడా అధికంగా తీసుకుని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఎక్కువగా పసుపు వాడటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో మరి చూద్దాం.

    ఆరోగ్యానికి మేలు చేసే పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం తొందరగా గడ్డకట్టదు. దీంతో గాయాల సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. అయితే రోజుకి 1.4 గ్రాముల పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఆక్సలేట్లను అధికంగా తీసుకోవడం వల్ల బాడీలో యూరీనరీ ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పసుపు ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటు కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బాడీలో ఐరన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది రక్తహీనతను పెంచుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో మాత్రమే పసుపు వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది.

    పసుపు అందాన్ని పెంచుకోవడంలో బాగా సహాయపడుతుంది. అయితే ఎక్కువగా దీనిని వాడటం వల్ల చర్మ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరి చర్మానికి పసుపు పడకపోతే చెమట, దురద, దద్దర్లు, మొటిమలు అధికంగా వస్తాయి. అయితే ఇది అన్ని రకాల చర్మాల వారికి జరగదు. పసుపులో కర్కుమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తీసుకుంటే.. ఐరన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి వంటల్లో ఈ పసుపును తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఎక్కువ మంది పులిహోరకి పసుపు ఎక్కువగా వేస్తుంటారు. కానీ తక్కువ మోతాదులో మాత్రమే వేస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇకనైన పసుపు వాడకాన్ని తగ్గించండి. అప్పుడే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.