women : వచ్చే ఆరేళ్లలో మహిళలు ఒంటరిగానే ఉంటారట.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఓ అధ్యయనం!

ఈ జనరేషన్‌లో డేటింగ్, డింగ్ కల్చర్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల పెళ్లి మీద అందరికీ నమ్మకం పోతుంది. దానికి తోడు డేటింగ్ యాప్స్ వాడకం పెరిగిపోయింది. ఇలా డేటింగ్ చేసిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : September 17, 2024 5:14 pm

The study reveals that women will be single in the next six years

Follow us on

women : ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మంది మహిళలు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వ్యక్తిగత కారణాలు, కెరీర్, సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వల్ల చాలామంది పెళ్లికి నిరాకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో మోర్గాన్ స్టాన్లీ మహిళలపై ఓ అధ్యయనం చేసింది. దీనిలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో అంటే 2030 నాటికి 45 శాతం మంది మహిళలు ఒంటరిగానే ఉండిపోతారని ఈ అధ్యయనంలో తెలిపింది. 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు పెళ్లి చేసుకోకుండా, ఒకవేళ చేసుకున్న పిల్లలు లేకుండా ఉంటారని ఈ అధ్యయనం ఇటీవల తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలామంది పెళ్లికి నిరాకరిస్తున్నారు. వ్యక్తిగతంగా వాళ్లకు ఉన్న కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఒంటరిగా ఉండటమే అన్ని విధాలుగా ఉండటం మంచిదని అనుకుంటున్నారు.

పూర్వ కాలంలో చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకునే వాళ్లు. కానీ ప్రస్తుతం ట్రెండ్ అంతా మారిపోయింది. పెళ్లి వయస్సు దాటిపోయిన కూడా చేసుకోవడం లేదు. వీటిని ముఖ్య కారణం విడాకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం. ఈరోజుల్లో చాలామంది పెళ్లి చేసుకుని, కొన్నేళ్ల తర్వాత విడిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్య మనుషుల వరకు అందరూ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా సంతోషంగా ఎవరూ లేరు. వెయ్యి మందిలో ఎవరో ఒకరు మాత్రమే సంతోషంగా ఉన్నారు. పెళ్లి చేసుకున్న కొత్తలో మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత గొడవలు పడుతూనే ఉన్నారు. వీటిన్నింటిని చూసి ప్రస్తుతం యువత పెళ్లికి నిరాకరిస్తున్నారు. వీటివల్ల సంతోషంగా లేకపోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యి.. ఇంకా సమస్యలను పెంచుకుంటున్నారు. వీటికంటే ఒంటరిగా ఉండటం మేలు అని అనుకుంటున్నారు. ఒంటరిగా ఉండి ప్రపంచాన్ని ట్రావెల్ చేస్తున్నారు. ఇలా సోలోగా ట్రావెల్ చేయడం వల్ల మనస్సుకు ఆహ్లాదకంగా ఉంటుందని యువత ఎక్కువగా భావిస్తున్నారు.

ఈ జనరేషన్‌లో డేటింగ్, డింగ్ కల్చర్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల పెళ్లి మీద అందరికీ నమ్మకం పోతుంది. దానికి తోడు డేటింగ్ యాప్స్ వాడకం పెరిగిపోయింది. ఇలా డేటింగ్ చేసిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ డేటింగ్‌లో ఉన్నప్పుడు పెళ్లికి విరక్తి వస్తుంది. రిలేషన్, పెళ్లి, పిల్లలు బాధ్యతలు కంటే ఒంటరిగా ఉంటేనే మేలు అని నిర్ణయించుకుంటున్నారు. అలాగే పురుషులతో పోటీగా మహిళలు కూడా అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారు. జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి, డబ్బులు సంపాదించాలని, విలాసవంతమైన జీవితం గడపాలని భావించి ఎక్కువ మంది మహిళలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. మీకు కూడా ఇలానే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలని ఉందా? కారణం ఏంటో మరి కామెంట్ చేయండి.