Boda Kakarakaya: కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. కొన్ని కూరగాయల్లో కొన్ని రకాల పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అందుకే అన్ని కూరగాయలను తినడం వల్ల శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్ లు లభిస్తాయి. టమాట, బెండకాయ, బీరకాయ, వంకాయ, ఆలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కూరగాయలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఆకాకర కూడా ఒకటి. ఆకాకార కాయ అంటే చాలా ప్రాంతాల్లో దీన్ని బోడకాకరకాయ అని కూడా పిలుస్తుంటారు. చాలా మందికి ఇవి తెలిసు కదా. కానీ పేర్లు వేరుగా ఉండవచ్చు. ఇప్పుడు అంటే ఈ సీజన్‌లో ఈ ఆకాకరలు చాలా లభ్యమవుతాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా తెచ్చుకొని కర్రీ చేసుకొని తినేసేయండి. వీటి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయట.. సీజన్ల వారీగా లభించే కూరగాయ కాబట్టి.. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారునిపుణులు. ఎవరైనా ఈ కూరగాయలు తినవచ్చట కూడా. ఇంతకీ ప్రయోజనాలు ఏంటంటే?
ఈ కూరగాయను ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ప్రజలు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే లభిస్తుంటాయి. మరి ఈ కాయకూర తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలిస్తే ఈ సారి మార్కెట్ వెళ్లినప్పుడు కచ్చితంగా తెచ్చుకుంటారు.
బోడ కాకర కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. కంటి దృష్టి మెరుగు అవుతుందట. రేచీకటి ఉన్న వారికి ఇాది మరింత హెల్ప్ అవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా మరింత బెటర్ అవుతుంది. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నశించేలా చేయడంలో బోడకాకర చాలా సహాయం చేస్తుంది. అంతేకాదు వీటి వల్ల డయాబెటీస్, బీపీ కంట్రోల్ అవుతాయి. ప్రీ డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి ఔషధం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా సూర్య రశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో కూడా ఈ కూరగాయ చాలా తోడ్పడుతుంది.
ఆకాకర తినడం వల్ల ముఖ్యంగా క్యార్సర్ కి దూరంగా ఉండవచ్చు. క్యాన్సర్ రాకుండా రక్షించడంలో బోడ కాకర చాలా పని చేస్తుంది. అలాగే ఈ కాయల నుంచి తీసే నూనె కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు. దీని వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ కూరగాయల తక్కువ గ్లైసెమిక్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. బోడకాకరకాయ రెగ్యులర్ వినియోగం చక్కెర స్థాయిని తగ్గింస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
బోడకాకరకాయ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. మీరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటే దీన్ని తినండి. లేదంటే దాని రసాన్ని తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి.ఇందులో ఉండే యాంటీ-హైపర్‌టెన్సివ్ లక్షణాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో బోడకాకరకాయలను తీసుకోవడం తల్లికి, బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది నరాల లోపాలను తగ్గిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.