https://oktelugu.com/

Tulasi: పడుకునేటప్పుడు తులసి ఆకులతో ఇలా చేస్తే మన సమస్యలన్నీ తీరీపోతాయా..?

తులసి ఆకులని వేడి నీళ్లల్లో వేసుకొని తాగితే ఏమైనా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇక తులసి చెట్టుకి పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టుగా భావిస్తూ ముందుగా తులసి మొక్కని పూజించడం హిందూ సాంప్రదాయంగా భావిస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 28, 2024 12:47 pm
    Tulasi

    Tulasi

    Follow us on

    Tulasi: హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు చెట్లను,పుట్టలను, రాళ్లను అన్నింటిని దేవతలుగా కొలుస్తూ ఉంటారు ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం ప్రకృతిలో ఉన్న ప్రతిది మానవుడికి ఏదోరకంగా హెల్ప్ చేస్తుందని నమ్ముతూ ఉంటాం. కాబట్టి మంచి జరగడం కోసం హిందువులు ఎక్కువగా దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. ఇక ఇదే క్రమంలో మనం ఎక్కువగా తులసి చెట్టుని పూజిస్తూ ఉంటాం..అందుకే మనలో చాలామంది దాన్ని ఇంటి ఆవరణలో ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.

    ఇక నిజంగా తులసి ఆకులని వేడి నీళ్లల్లో వేసుకొని తాగితే ఏమైనా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇక తులసి చెట్టుకి పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టుగా భావిస్తూ ముందుగా తులసి మొక్కని పూజించడం హిందూ సాంప్రదాయంగా భావిస్తారు.ఇక ఇలాంటి క్రమం లోనే పడుకునేటప్పుడు దిండు కింద తులసి ఆకులను పెట్టుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయట. అవి ఏంటి అంటే మనం పడుకునేటప్పుడు ఆకులను తీసుకొని మన తల దిండు కింద కనక పెట్టుకుని పడుకున్నట్లైతే మైండ్ లో ఉన్న మెంటల్ టెన్షన్స్ అన్నీ పోయి మైండ్ రిలాక్స్ అవుతుందట.

    ఇంక అలాగే నెగిటివ్ ఆలోచనలు ఏమీ రాకుండా పాజిటివ్ గా మన ఆలోచనలు ఉండే విధంగా ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయని తెలుస్తుంది. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు కూడా తులసి ఆకుల వాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దానివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అని తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే తులసి ఆకుల్ని ఒక ఎర్రని వస్త్రంలో కట్టి పడుకునేటప్పుడు తల కింద పెట్టుకున్నట్లైతే మనకు రావలసిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా కూడా అవి తొందరగా మన దగ్గరికి వస్తాయట…ఇలా తులసి ఆకుల ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయట…అందుకే తులసి మొక్క కి మన ఇళ్ళల్లో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు…