Accidents: యాక్సిడెంట్లు జరగడానికి డ్రైవర్ల నిర్లక్ష్యం తో పాటు మరో కారణం ఏంటో తెలుసా..?

మేజర్ గా కొన్ని ఆక్సిడెంట్స్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం అని తెలుస్తుంది. వాళ్లు మందు తాగి బండ్లు నడపడం, నిద్ర మత్తులో ఉండి బండ్లు నడపడం వల్లనే యాక్సిడెంట్లు హెవీగా పెరిగిపోతున్నాయి.

Written By: Gopi, Updated On : April 28, 2024 2:15 pm

Accidents

Follow us on

Accidents: ప్రస్తుతం ఇండియా మొత్తం మీద వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇక దీని ద్వారా కూడా పొల్యూషన్ అధికంగా పెరుగుతుంది. దీని ఫలితంగా చాలామంది అనారోగ్యం బారిన కూడా పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు బిక్కుబిక్కుమంటూ వాళ్లకోసం ఎదురు చూసే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకు అంటే రోడ్లమీద ఎప్పుడు,ఎక్కడ, ఎవరికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఎవరి వల్ల ఎవరు మరణిస్తున్నారు అనే విషయాల్లో క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా హైవే రోడ్లపైన అయితే యాక్సిడెంట్లు బీభత్సంగా జరుగుతున్నాయి.ఇక దానికి కారణం ఏంటి అనేది కచ్చితంగా చెప్పలేము.

కానీ మేజర్ గా కొన్ని ఆక్సిడెంట్స్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం అని తెలుస్తుంది. వాళ్లు మందు తాగి బండ్లు నడపడం, నిద్ర మత్తులో ఉండి బండ్లు నడపడం వల్లనే యాక్సిడెంట్లు హెవీగా పెరిగిపోతున్నాయి. దాని వల్ల చాలామంది మరణిస్తున్నారు అనే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు రీసెంట్ గా ఫేస్ బుక్ లో ఒక వీడియోని రిలీజ్ చేశారు.

ఇక దాని ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్సుల వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయట. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నైట్ టైం లో బైక్ లు, సైకిళ్ళ మీద గానీ నడుచుకుంటూ వెళ్లే వాళ్లు బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వాహనం నడిపే వ్యక్తులకు చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.

ఇక అందువల్ల నైట్లో వెళ్ళేటప్పుడు ఎల్లో, వైట్, గ్రీన్ కలర్ షర్ట్స్ వేసుకుంటే మంచిదని వాళ్ళు సూచిస్తున్నారు. లేదంటే రిఫ్లెక్ట్ అయ్యే టీషర్ట్స్ గాని, షర్ట్స్ గాని వాడిన ఇబ్బంది ఉండదు అని చెబుతూ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.