మారుతున్న కాలంతో పాటే చాలామంది ఉరుకులుపరుగులతో సరైన సమయానికి తిండి తినక, తగినంత నిద్ర లేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ అందితే మాత్రమే పనులను సులభంగా చేయడం సాధ్యమవుతుంది. ప్రతిరోజూ బాదంపాలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ బాదంపాలు తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
Also Read: సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి సులభ మార్గాలివే..?
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బాదంపాలను తీసుకుంటే మంచిది. ఇంటి పని, ఒత్తిడి వల్ల విద్యార్థులు, ఉద్యోగుల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే] బాదం పాలను తీసుకోవడం ద్వారా సులభంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. సోడియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్ బాదంపాలలో పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతను నివారించడంలో బాదంపాలు ఎంతగానో సహాయపడతాయి.
Also Read: ఎముకలు దృఢంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?
పాలు, పాల ఉత్పత్తుల వల్ల అలర్జీతో బాధ పడే వాళ్లు బాదంపాలు తీసుకుంటే మంచిది. బాదం పప్పులను నానబెట్టి, రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్లలో రుబ్బిన బాదం పప్పును వేసి పాలలా చిక్కబడే వరకు కలిపి బాదం పాలను తయారు చేసుకోవచ్చు. బాదం పాలు రోజూ తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో బాదం పాలు ఎంతగానో సహాయపడతాయి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
విటమిన్ డి లోపంలో బాధ పడే వళ్లు బాదం పాలను డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. రోజూ బాదం పాలు తాగితే కీళ్ల నొప్పుల సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టవచ్చు. బాదం పాలు రుచిగా ఉండటంతో పాటు కండరాల నొప్పులకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి.