https://oktelugu.com/

సాయి ధరమ్ ని నమ్మొద్దు అంటున్న శిరీష్

చాలాకాలం తరువాత మెగా కుటుంబంలో జరిగిన నిహారిక-చైతన్యల వివాహాన్ని ఘనంగా జరిపారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై ఈ వేడుకను ఆడంబరంగా నిర్వహించారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఐదురోజులు నిహారిక వివాహం జరిగింది. మెగా హీరోలందరూ పెళ్లి వేడుకలలో కలిసి సందడి చేశారు. కాగా త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరోమారు పెళ్లి భాజా మోగనుందని వార్తలు రావడం జరిగింది. 2021లో మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలు […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 11:34 AM IST
    Follow us on


    చాలాకాలం తరువాత మెగా కుటుంబంలో జరిగిన నిహారిక-చైతన్యల వివాహాన్ని ఘనంగా జరిపారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై ఈ వేడుకను ఆడంబరంగా నిర్వహించారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఐదురోజులు నిహారిక వివాహం జరిగింది. మెగా హీరోలందరూ పెళ్లి వేడుకలలో కలిసి సందడి చేశారు. కాగా త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరోమారు పెళ్లి భాజా మోగనుందని వార్తలు రావడం జరిగింది. 2021లో మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 30 ప్లస్ లో ఉన్న సాయి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని ఆ కథనాల సారాంశం.

    Also Read: బిగ్‌బాస్‌ రన్నరప్‌ కోసం హోరాహోరీ

    అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ స్పష్టత ఇచ్చారు. 2021లో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు. అప్పుడే తనకు పెళ్లి ఆలోచన లేదన్న సాయి ధరమ్… మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ వివాహం 2021లో జరిగే సూచనలు కలవు… పేరెంట్స్ ఆలోచనలో ఉన్నారని ధరమ్ తేజ్ చిన్న క్లూ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీ మెంబర్ గా అల్లు శిరీష్ వివాహం గురించి ధరమ్ తేజ్ చెప్పడంతో, లాంఛనమే అనుకున్నారు అందరూ. కాగా సాయి ధరమ్ వ్యాఖ్యలపై అల్లు శిరీష్ స్పందించడం జరిగింది.

    Also Read: బిగ్ బాస్ చెక్ తో బంగారం కొన్న గంగవ్వ.. ఎంత ఇచ్చారో తెలుసా?

    ధరమ్ తేజ్ జోక్ చేస్తున్నాడని, అతని మాటలు ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని శిరీష్ అన్నారు. అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదని ఆయన అన్నారు. అలాగే తన పేరెంట్స్ కూడా ప్రస్తుతానికి తన పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదని తెలియజేశారు. దీనితో 2021లో మెగా హీరోలలో ఒకరు పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న ఊహాగానాలు తెరపడింది. ఇక సాయి ధరమ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా థియేటర్స్ ప్రారంభం కాలేదు, దీనితో అనుకున్న ప్రకారం డిసెంబర్ లో విడుదల చేస్తారో లేదో చూడాలి. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్