https://oktelugu.com/

Anemia: ఈ జాగ్రత్తలు పాటిస్తే సులువుగా రక్తహీనతకు చెక్?

మనలో చాలామంది సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కడుపు నిండినా శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రం అందవు. రక్తహీనత వల్ల కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అవిసె గింజలలో శరీరానికి అవసరమైన పీచు, ప్రోటీన్లతో పాటు ఓమేగా […]

Written By: , Updated On : September 1, 2021 / 12:20 PM IST
Follow us on

Tips To Prevent Anemiaమనలో చాలామంది సమయానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కడుపు నిండినా శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రం అందవు. రక్తహీనత వల్ల కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది.

అవిసె గింజలలో శరీరానికి అవసరమైన పీచు, ప్రోటీన్లతో పాటు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అవిసె గింజలు తినడం వల్ల నీరసం, నిస్సత్తువ దరి చేరవు. అవిసె గింజల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. బచ్చలికూరను తినడం వల్ల కూడా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కే1, బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ బి9, ఐరన్ లభించే అవకాశం ఉంటుంది.

సోయాబీన్స్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్,మెగ్నీషియంతో పాటు క్యాల్షియం కూడా లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచే ఆహార పదార్థాలలో సొయాబీన్స్ కూడా ఒకటి. మొలకలు తినడం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పెసలు ఆరోగ్యానికి మంచివి. పెరుగు తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

రోజుల తరబడి పెరుగును ఫ్రిజ్ లో ఉంచితే పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. పెరుగులో ఉండే క్యాల్షియం, బీ12 ఎముకలను పటిష్టం చేయడంలో తోడ్పడతాయి. మెంతి ద్వారా శరీరానికి అవసరమైన పీచు లభిస్తుంది. మెంతిలో ఉండే ఐరన్, విటమిన్ సి రక్తహీనత నుంచి సులువుగా కోలుకునేలా చేస్తుంది.