https://oktelugu.com/

Lic Policy: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. నెలకు రూ.1,100 కడితే రూ.25 లక్షలు?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు రెండు రకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులను పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులను పొందే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 1, 2021 / 12:35 PM IST
    Follow us on

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు రెండు రకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులను పొందవచ్చు.

    ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లలో ఎక్కువమంది జీవన్ ఆనంద్ పాలసీని తీసుకుంటున్నారు. ఉదాహరణకు 5 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 35 సంవత్సరాలు అనుకుంటే నెలకు 1,131 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో 25 లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు.

    మొత్తం 25 లక్షల రూపాయలలో బీమా మొత్తం 5 లక్షల రూపాయలు కాగా ఎఫ్ఏబీ 11.5 లక్షల రూపాయలు, బోనస్ 8.5 లక్షల రూపాయలుగా ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత సైతం లైఫ్ కవరేజ్ ను పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. 15 నుంచి 35 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.

    తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉండటంతో చాలామంది ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సమీపంలోని ఎల్‌ఐసీ ఏజెంట్ లేదా ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.