Obesity : ఈ రోజుల్లో మన ఒంట్లో కొవ్వు పెరిగిపోతోంది. దీని వల్ల ఊబకాయం సమస్య వస్తోంది. పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతోంది. దీంతో డ్రమ్ములా మారుతున్నారు. అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఊబకాయం సమస్యకు చెక్ పెట్టాలని అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొవ్వును కరిగించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తున్నారు.
ఆయుర్వేదంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈ కషాయం ఒకటి. జీలకర్ర, మెంతులు వేడి చేసుకుని పొడి దంచుకోవాలి దాన్ని ఓ సీసాలో భద్రపరచుకోవాలి. రోజు ఉదయం పరగడుపున ఓ గ్లాసు నీళ్లలో వేసుకుని అందులో నిమ్మరసం పిండుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మన పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు మాయమవుతుంది.
ఇంకా గ్రీన్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. నాలుగైదు పుదీనా ఆకులు తీసుకుని నీళ్లల్లో వేసుకుని మరిగించాలి. అందులో కాస్త టీ పొడి వేసుకుని వేడి చేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండుకుని తాగితే కూడా మంచి ఫలితం వస్తుంది. ఇలా మన పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో వీటిని వాడుకుని కొవ్వును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలా మన శరీరంలో ఏర్పడిన కొవ్వును తగ్గించుకోవాలి. లేకపోతే ఊబకాయం పెరిగి చాలా రోగాలకు కారణమవుతాం. దీంతో ఇతర జబ్బుల ప్రభావం పెరిగితే మనకే నష్టం. అందుకే పొట్టలో పేరుకుపోయిన కొవ్వున కరిగించుకునేందుకు ఈ చిట్కాలు వాడుకుని కొవ్వును కరిగించుకోవాల్సిన బాధ్యత ఊబకాయులపై ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.