https://oktelugu.com/

Vaastu Tips : వాస్తు టిప్స్: ఇంట్లో దుష్టశక్తులను ఎలా దూరం చేసుకోవచ్చు

ఇంట్లో కర్పూరంతో పాటు లవంగాలు వేసి కాల్చాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వాడిన, పాడైపోయిన వస్తువులు ఉంచుకోకూడదు. 

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2023 6:50 pm
    Follow us on

    Vaastu Tips: ఇల్లు మనకు హాయినిచ్చే చోటు. ఎవరి ఇంట్లో వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఏదైనా ఊరికి వెళితే అసలు ఉండరు. తమ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది అనుకోవడం సహజమే. ఇలా ఎవరి ఇల్లు వారికి మానసిక ఆనందాన్నిస్తుంది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అన్ని అనుకూలిస్తాయి. అదే నెగెటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం మనకు మనసు స్థిరంగా ఉండదు. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. దీని గురించి తెలుసుకుని పరిహారాలు చేసుకోవడం మంచిది.

    దుష్టశక్తులకు సంకేతాలేంటి?

    ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయనడానికి కొన్ని వ్యతిరేక సంకేతాలు మనకు దర్శనమిస్తాయి. అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. గుండెల్లో దడ పుడుతుంది. ఇంట్లో మొక్కలు, పువ్వులు చనిపోతాయి. సాలీడ్లు గూళ్లు పెడతాయి. ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి. తలనొప్పి నిరంతం వేధిస్తుంది. ఏదో ఒక ట్యాప్ నుంచి నీరు లీకవుతుంది. కిటికీలు, తలుపులు వేసే, తీసే సమయంలో చప్పుడు చప్పుడు వస్తుంది. ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. తరచుగా పాలు పొంగిపోతాయి. కుటుంబ సభ్యుల్లో కోపాలు పెరుగుతాయి.

    నెగెటివ్ ఎనర్జీ పెరగడానికి కారణాలు

    ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉంచుకోవద్దు. మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టకూడదు. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు ప్రతికూలతలు తీసుకొస్తాయి. దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం కచ్చితంగా కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    దుష్ట శక్తులను దూరంచేసే పరిహారాలు

    ఇంట్లో దుష్టశక్తులు ఉంటే దూరం చేసుకునే పరిహారాల్లో వాష్ రూమ్ లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి. ఈశాన్యంలో ఫౌండేన్ ఏర్పాటు చేయడం మంచిది. ఇల్లు తుడిచే నీటిలో సముద్రపు ఉప్పు వేసుకోవాలి. ఇంట్లో కర్పూరంతో పాటు లవంగాలు వేసి కాల్చాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వాడిన, పాడైపోయిన వస్తువులు ఉంచుకోకూడదు.