Liver : కాలేయం ఖరాబ్ కాకుండా ఈ చిట్కా ఉపయోగపడుతుంది

గుప్పెడు శనగలను నీళ్లలో వేసి ఉడికించాలి. అవి ఉడికిన తరువాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి కలుపుకుని తినడం వల్ల లివర్ డ్యామేజ్ ను పోగొడుతుంది.

Written By: Srinivas, Updated On : May 1, 2023 11:41 am
Follow us on

Liver : మద్యపానం, ధూమపానం అలవాట్లు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు సాయంత్రం అయిందంటే చాలు మద్యం తాగుతున్నారు. సిగరెట్లు కూడా తాగుతున్నారు. మద్యంతో కాలేయం, సిగరెట్లతో ఊపిరిత్తులు దెబ్బ తింటున్నాయి. కానీ మనవారు పట్టించుకోవడం లేదు. ఎన్ని రకాల బాధలు వచ్చినా చెడు అలవాట్లు మాత్రం మార్చుకోవడం లేదు. ఫలితంగా లివర్, ఊపిరితిత్తుల పనితీరు మందగించి జబ్బుల బారిన పడుతున్నారు.

చెడు అలవాట్లతో మన శరీరం దెబ్బతింటున్నా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు వస్తున్నా లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో మద్యపానం అలవాటును మాత్రం మానడం లేదు.

అతిగా తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. దీంతో మరణమే శరణ్యం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో లివర్ డ్యామేజ్ ను సరి చేసుకోవాలంటే ఓ చిట్కా ఉంది. గుప్పెడు శనగలను నీళ్లలో వేసి ఉడికించాలి. అవి ఉడికిన తరువాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి కలుపుకుని తినడం వల్ల లివర్ డ్యామేజ్ ను పోగొడుతుంది. లివర్ ఎంత చెడిపోయినా తిరిగి బాగయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఈ రోజుల్లో బాణపొట్ట కూడా ఇబ్బంది పెడుతుంది. పొట్ట పెరిగిపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తారు. దీనికి కూడా ఓ మంచి పరిహారం ఉంది. దీనికి రెండు నిమ్మకాయలను ముక్కలుగా కోసుకోవాలి. తరువాత కీర దోస కాయను ముక్కలుగా కోసుకోవాలి. వీటితోపాటు ఓ గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని దాహం వేసినప్పుడల్లా తాగితే బాణపొట్ట పోతుంది.