Drinking Water : ఆధునిక కాలంలో మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వల్ల మనకు పలు రకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగుతున్నారు. ఇలా నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.
ఉదయం నిద్ర లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగడం వల్ల జీవక్రియ బాగుంటుంది. శరీరం ఉత్తేజితమవుతుంది. దీంతో మనకు మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. ఉదయం నిద్ర లేవగానే కొందరికి ఆకలి విపరీతంగా వేస్తుంది. ఇలాంటి వారు నీళ్లు తాగడం వల్ల ఆకలి భావన తగ్గుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు.
ఉదయం నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీంతో శరీరం డీ హైడ్రేడ్ గా కాకుండా నిరోధిస్తుంది. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తెలివితేటలు బాగుంటాయి. ఉదయం నీళ్లు తాగడం వల్ల బద్ధకం పోతుంది. చురుకుదనం వస్తుంది. దీనివల్ల నీరసం లేకుండా పోతుంది. నీళ్లు తాగడం వల్ల శరీరం ముడతలుగా మారదు. ముసలితనం త్వరగా దరిచేరదు.
మనం తాగే నీరుతో శరీరంలోని మలినాలను బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. దీంతో ఎండదెబ్బ సోకుతుంది. ఇది ప్రాణాలు పోయే ప్రమాదం తెస్తుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగితేనే మంచిది.