Skin Care Tips: వృద్దాప్య ఛాయలకు గుడ్ బాయ్..యంగ్ లుక్ కోసం ఇలా చేయండి

అందాన్ని పెంచడంలో విటమిన్ కె చాలా సహాయం చేస్తుంది. అందుకే మీ డైట్‌లో విటమిన్ కె ఉండే ఆహారాలను చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది కాబట్టి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక వయసు పెరుగుతున్నా సరే యంగ్‌ లుక్‌లో మెరిసి పోతారు.

Written By: Swathi, Updated On : ఆగస్ట్ 13, 2024 6:54 సా.

Skin Care Tips

Follow us on

Skin Care Tips: మొహాని కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఛాయ కోసం చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. వైద్యుల సలహా నుంచి ఇంట్లో చిట్కాల వరకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు సఫలం అయితే మరికొన్ని సార్లు మాత్రం విఫలం అవుతుంటాయి. ఇక ప్రస్తుతం ఉన్న టెన్షన్ లు, జీవనవిధానం, ఆహారం వంటివి యంగ్ ఏజ్ లోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తున్నాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలను మీ డైట్ లో చేర్చుకుంటే సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మెరిసే అందమైన చర్మం కావాలని అందరూ అనుకుంటారు కానీ దానికి తగిన రిజల్ట్ అందరికీ రాకపోవచ్చు. చామన ఛాయగా ఉన్నా కూడా ముఖంలో గ్లో ఉంటే.. సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు కదా. కాబట్టి కలర్ కంటే ముందు ముఖంలో గ్లో అవసరం అనుకుంటున్నారా?. అదే విధంగా వయసు పెరుగుతుంటే యంగ్‌ లుక్‌లో కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. మీరు కూడా ఇదే కోరుకుంటే ఈ చిన్న టిప్స్ పాటించండి. రిజల్ట్ మీకే అర్థం అవుతుంది. మరి అవేంటో ఓ సారి చూసేయండి.

అందాన్ని పెంచడంలో విటమిన్ కె చాలా సహాయం చేస్తుంది. అందుకే మీ డైట్‌లో విటమిన్ కె ఉండే ఆహారాలను చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది కాబట్టి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక వయసు పెరుగుతున్నా సరే యంగ్‌ లుక్‌లో మెరిసి పోతారు.

వయసును తగ్గించడానికి బ్రోకలీ చాలా సహాయం చేస్తుంది. మీ వయసును కనిపించకుండా చేస్తుంది ఈ వంటకం. బ్రోకలిలో చర్మానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, జింక్ లు ఉంటాయి.. ఇవి వయసు తొందరగా పెరగకుండా, యంగ్ లుక్‌లో కనిపించేలా చేస్తుంటాయి కాబట్టి మీ డైట్ లో వీటిని చేర్చుకోండి.

చర్మాన్ని అందంగా మార్చడంలో పాలకూర కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో కూడా విటమిన్లు ఎ, బి, సి, కె లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక చిన్న గ్లాస్ అయినా పాలకూర రసం తాగితే.. వృద్ధాప్య ఛాయలు త్వరగా రమ్మన్నా రావు అంటున్నారు నిపుణులు. మీ స్కిన్ చాలా బ్రైట్‌గా, గ్లోయింగ్‌గా అవుతుంది.

దానిమ్మ పండు కూడా యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ కె, సి, కొల్లాజెన్ ఉంటాయి. ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వకుండా మీకు సహాయం చేస్తుంది. అంతే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కాబట్టి దానిమ్మ పండును తీసుకోండి.

బ్లూబెర్రీ : ఈ పండ్లు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, సి, ఈ విటమిన్లు ముఖ చర్మానికి మృదుత్వాన్ని అందించడంలో సహాయం చేస్తాయి. కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి.. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను దరిచేరనివ్వు.అంతేకాదు ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే సాల్సిలిక్‌ యాసిడ్‌ చర్మంలోని మృతకణాలను బయటకు పంపుతుంది కాబట్టి మీ ముఖ ఛాయ అందంగా ఉంటుంది. వీటిలోని సి విటమిన్‌, యాంతోసయానిన్‌ బాడీలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.