Urine infection : యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లయితే.. ఈ చిట్కాలు పాటించండి

చాలామంది మూత్రం వెళ్లిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోరు. దీనివల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ప్లేస్‌ను తేమగా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. శరీరానికి సరిపడా నీరు తాగకపోయిన ఇన్ఫెక్షన్ వస్తుంది. మలవిసర్జన తర్వాత మలద్వారం నుంచి బ్యాక్టీరియా, క్రిములు మూత్రనాళంలోకి వెళ్లడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.

Written By: Suresh, Updated On : ఆగస్ట్ 13, 2024 6:47 సా.

Urine Track Infection

Follow us on

Urine infection : ఈమధ్యకాలంలో చాలామంది యూరినరీ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో దీనితో ఇబ్బందిపడే ఉంటారు. అయితే ఈ సమస్యతో బాధపడేవాళ్లు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉంటారు. అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ వల్ల మూత్రంలో మంట, రక్తస్రావం, జ్వరం వస్తుంటాయి. మరి ఈ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తుంది? దీనికి కారణాలేంటి? దీనిని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

చాలామంది మూత్రం వెళ్లిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోరు. దీనివల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ప్లేస్‌ను తేమగా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. శరీరానికి సరిపడా నీరు తాగకపోయిన ఇన్ఫెక్షన్ వస్తుంది. మలవిసర్జన తర్వాత మలద్వారం నుంచి బ్యాక్టీరియా, క్రిములు మూత్రనాళంలోకి వెళ్లడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. పులుపు, కారం, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడంతో పాటు కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్, కాఫీ, చాక్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అంత ప్రమాదం లేదు. కానీ బాత్రూమ్ వెళ్లినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే దీనిని యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. దీనికి చికిత్సగా యాంటీ బయాటిక్స్ మెడిసిన్ ఇస్తారు. ఇవి మూత్రనాళంలోని సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి. అయితే యాంటీ బయాటిక్స్‌ను ఎక్కువగా వాడకూడదు. అధికంగా వాడితే దద్దుర్లు, మైకం, వికారం, అతిసారం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు నీరు ఎక్కువగా తాగితే ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గే అవకాశం ఉంది.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేప ఆకులతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బయటపడవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్రనాళం నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తాయి. గ్లాసు నీటిలో వేపాకులను వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు కాన్‌బెర్రీస్ జ్యూస్‌ తాగాలి. ప్రోబయోటిక్స్ తీసుకుంటుండాలి. ఇవి చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. అలాగే విటమిన్ సి ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇందులోని సిట్రిక్ మూత్రనాళంలో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా, కారం తక్కువగా తినాలి. బయట ఫుడ్‌ తినకపోవడం బెటర్.

ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహంచాలి. కాటన్ లో దుస్తులు మాత్రమే ధరించాలి. కనీసం రోజుకి రెండుసార్లు లో దుస్తులు ఛేంజ్ చేసుకోవాలి. జననాంగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇన్ఫెక్షన్‌తో బాధపడేవాళ్లు మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకోకూడదు. యూరిన్ వచ్చిన వెంటనే వెళ్లాలి. లేకపోతే బ్యాక్టీరియా ఉండి ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. మూత్రం వెళ్లిన ప్రతిసారి శుభ్రం చేసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.