Paracetamol : ముందు జాగ్రత్త కోసం చాలామంది ఇంట్లో మాత్రలు ఉంచుకుంటారు. అర్థరాత్రి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం అని ఫీవర్, విరేచనాలు, తలనొప్పి వాటికి టాబ్లెట్లు పెట్టుకుంటారు. అందులో పారాసిటమాల్ తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సాధారణంగా బాడీ హీట్ అయితే ఫీవర్ వచ్చిందని పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటారు. మరికొందరైతే ఫీవర్ వస్తాదేమోనని ముందు జాగ్రత్తగా మాత్రలు వేస్తారు. కానీ కొందరైతే జలుబు, జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు ఇలా ఏ సమస్య వచ్చినా పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటారు. వీటిని అధికంగా వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మాత్రలను అధిక మోతాదులో శరీరంలోకి పంపడం వల్ల కాలేయం దెబ్బతింటుందని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ తెలిపింది. చాలామంది ఈ మాత్రలను జ్వరం, దగ్గు, జలుబు, నొప్పి, వికారంగా ఉన్నవాళ్లు డాక్టర్ అనుమతి తీసుకోకుండా వేసుకుంటారు. అవసరం లేకపోయిన అధిక మోతాదులో వేసుకోవడం వల్ల ప్రాణానికే ప్రమాదమని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తెలిపింది.
పారాసిటమాల్‌లో 500, 650 అనే రెండు రకాల మాత్రలు ఉంటాయి. వయస్సు, జ్వరం తీవ్రతను బట్టి వీటిని డాక్టర్లు సూచిస్తారు. చాలామంది ఎక్కువగా పారాసిటమాల్ 500 వాడుతారు. దీనిని ఎసిటమైనోఫిన్ అని కూడా అంటారు. అయితే దీనిని స్థాయికి మించి వాడితే తప్పకుండా ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇబుప్రోఫెన్, న్యాప్రోక్సెన్‌లతో చూస్తే ఎసిటమైనోఫిన్ అనారోగ్యానికి గురిచేస్తుంది. దీనిని అధికంగా తీసుకుంటే కాలేయంలో విషపూరితాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో కాలేయం దెబ్బతింటుంది. ఇది కొన్నిసార్లు కాలేయ మార్పిడి లేదా మరణానికి దారితీస్తుందని వైద్య నిపుణలు చెబుతున్నారు.
ఈ టాబ్లెట్స్‌ను అధికంగా వాడం వల్ల విరేచనాలు, క్లళ్లు తిరగడం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అలాగే అలర్జీలు రావడం, మూత్ర పిండాలు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మద్యం తాగినప్పుడు వేసుకుంటే.. పారాసిటమాల్‌లోని కాంపౌండ్స్ ఆల్కహాల్‌తో నెగెటివ్ రియాక్షన్ జరుపుతుంది. దీనివల్ల అవయవాలు దెబ్బతింటాయి. అయితే ఈ టాబ్లెట్‌ను రోజులో తక్కువ మోతాదులో మాత్రమే వేయాలి. 24 గంటల్లో 4సార్లు కంటే ఎక్కువ ఈ మాత్రలు తీసుకోకూడదు. ఇవి వాడేటప్పుడు మెటోక్లోప్రమైడ్ వంటి మందులకు దూరంగా ఉండాలి. ఇలాంటి మందులు వాడేటప్పుడు ముఖ్యంగా డాక్టర్ అనుమతితో మాత్రమే వేయాలి. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
తొందరగా జ్వరం తగ్గాలని కొందరు వీటిని ఎక్కువగా వేసుకుంటారు. అయితే ఇలా వేసుకోవడం అంతమంచిది కాదట. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 1000 mg కంటే ఎక్కువగా ఈ మాత్రలు తినకూడదు. అంతకంటే ఎక్కువ తింటే కాలేయ సంబంధ సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారు. అయితే పారాసిటమాల్‌ను పిల్లలకు ఇచ్చేటప్పుడు 101.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. పారాసిటమాల్‌ను జోసెఫ్ వాన్ మెరింగ్ 1893లో మొదటసారిగా తీసుకొచ్చారు. ఆ తర్వాత యూనైడెట్ స్టేట్స్‌లో 1950 ప్రాంతంలో బాగా ఉపయోగించారు. అలా ఈ మాత్రలను ప్రజలు నమ్మడం మొదలుపెట్టడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.