Tiffins : ప్రోటీన్-రిచ్ అల్పాహారం మీ రోజును ప్రారంభించడానికి గొప్ప మార్గం. జనాదరణ పొందిన భారతీయ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో ఎంత ప్రోటీన్ ఉందని మీరు ఆలోచించారా? మంచి ప్రొటీన్ ఉండే టిఫిన్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే మీరు తిన్న అల్పాహారానికి పెద్ద యూజ్ లేకుండా పోతుంది. మరి ఎలాంటి టిఫిన్లు బెటర్ అనే విషయం తెలుసుకుందామా?
ఫుడ్‌ఫార్మర్‌గా ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ సృష్టికర్త రేవంత్ హిమత్‌సింకా ద్వారా ఎలాంటి అల్పాహారంలో ప్రొటీన్లు ఉంటాయి. వాటిని ఎలా తీసుకోవాలి అనే విషయాల మీద ఓ క్లారిటీ వస్తుంది. ముందుగా ఆమ్లెట్ గురించి తెలుసుకుందాం. అయితే 2 గుడ్లు ఉపయోగించి తయారుచేసిన ఆమ్లెట్ లో 12 గ్రా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇక గుడ్లు తినడం చాలా మందికి ఇష్టం. సో ఉడకబెట్టిన గుడ్లు అయినా సరే మీకు ప్రొటీన్ ను అందిస్తాయి. ఉడికించిన గుడ్డు ప్రోటీన్ గొప్ప మూలంగా చెబుతుంటారు. ఒక గుడ్డులో 6 గ్రా ఉంటుంది. కొంచెం ఉప్పు లేదా తరిగిన టమోటాలు, ఉల్లిపాయలతో దీన్ని ఆస్వాదించండి.
హోల్ వీట్ బ్రెడ్ లో కూడా మంచి ప్రొటీన్ ఉంటుంది. ఈ బ్రెడ్ 2 స్లైస్‌లలో 7.2 గ్రా ప్రోటీన్ ఉంటుంది. వీటిని గుడ్లతో జత చేసుకొని తింటే మీరు మొత్తం ప్రోటీన్‌ను పెంచుకోవచ్చు. ఉప్మా కూడా ప్రయోజనాలు అందిస్తుంది. సెమోలినా (సూజి) ఉపయోగించి తయారు చేసే ఉప్మా, 5 గ్రా ప్రోటీన్‌ను కలిగి ఉన్న మరొక ప్రసిద్ధ అల్పాహార వంటకంగా చెబుతున్నారు రేవంత్ హిమత్ సింకా.
ఇక పప్పును కూడా అల్పాహారంగా వాడవచ్చు. ఒక కప్పు పప్పులో 5 గ్రా ప్రోటీన్ ఉంటుంది. కొందరికి తీపి ఇష్టం అయితే మరికొందరు ఉప్పు, కూరగాయలను కలుపి తింటారు. ఇక తర్వాత ఇడ్లీ. 2 ఇడ్లీలలో 4.6 గ్రా ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీలు తరచుగా కొబ్బరి చట్నీ, సాంబార్‌తో జత చేసుకొని తింటే టేస్ట్ తో పాటు ప్రొటీన్ లను కూడా పొందవచ్చు.
సాదా దోస ను చాలా మంది ఇష్టపడతారు. ఒక సాదా దోస 3.1 గ్రా ప్రోటీన్‌తో ప్యాక్ అవుతుంది. ఇందులో ఉపయోగించే మినపప్పు వల్ల మీకు మంచి ప్రొటీన్ లభిస్తుంది. పోహా అదేనండి అటుకులు కూడా బెస్ట్ టిఫిన్ గా ఉపయోగిస్తారు చాలా మంది. ఈ ప్రసిద్ధ అల్పాహారం ఎంపిక లో 2.9 గ్రా ప్రోటీన్ ఉంటుంది. చాలా మంది నమ్కీన్, వేరుశెనగ, కొత్తిమీరతో దీన్ని ఆస్వాదిస్తారు. సాదా పరాటాను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ఒక ప్రసిద్ధ పంజాబీ అల్పాహారం. ఒక సాదా పరాటాలో 2-3గ్రా ప్రోటీన్ ఉంటుంది. కాస్త పెరుగుతో తినండి మరింత ప్రయోజనం కూడా.