Weight Lose : గట్టిగా అనుకోండి ఏదైనా అయిపోతుంది. నిజంగానే అనుకుంటే అయిపోతుందా? కాదండోయ్ దానికి తగ్గట్టు శ్రమించాలి. అప్పుడే కదా ఎలాంటి కష్టాన్ని అయినా అధిగమించవచ్చు. మరి మీరు అనుకున్న పనికి మీరు కష్టపడితేనే కదా సక్సెస్ వచ్చేది. అనుకొని ఇంట్లో కూర్చుంటే జరిగిపోతుందా చెప్పండి. అయితే బరువు తగ్గాలి అని చాలా మంది అంటారు. కానీ ఉదయం 7 అయినా సరే నిద్ర లేవరు. కనీసం వాకింగ్ కూడా చేయరు. ఇక ఫుడ్ విషయంలో అసలు జాగ్రత్తలు తీసుకోరు. సో లావు తగ్గేది ఎలా?
నేటి కాలంలో బరువు, ఊబకాయం వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికంగా బరువు ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకే బరువును ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే. మీరు కూడా లావుగా ఉన్నారా? బరువును తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ అవడం లేదా? ఈ మహిళ గురించి తెలుసుకుంటే తర్వాత కాస్త మీరు బరువు తగ్గుతారు. తెలుసుకుంటే బరువు తగ్గడమా అనుకోవద్దు. కొన్ని నియమాలు ఆమె మాదిరి మీరు కూడా పాటించాలి బాస్. అప్పుడే కాస్త అయినా బరువు తగ్గుతారు.
కేవలం చాలా కొన్ని రోజుల్లోనే ఏకంగా 18 కేజీల బరువు తగ్గింది ఓ మహిళ. అందుకు సంబంధించిన విషయాలు కూడా పోస్ట్ చేసింది. మరి బరువును ఎలా అదుపు చేయవచ్చో అందుకు సంబంధించిన విషయాలను కూడా ఆమె వెల్లడించింది. మరి ఆలస్యం చేయకుండా ఆ వివరాలు తెలుసుకుందాం.
బరువు పెరిగినంత ఈజీ కాదండోయ్ తగ్గడం. కానీ కొందరు మాత్రం ఏమీ తినకపోయినా కూడా లావు అవుతారు. ఇలాంటి వారు ఎలా బరువు తగ్గాలని ఆందోళన చెందుతారు. కానీ ఇంటి వద్ద ఉంటూనే మీ డైట్ ప్లాన్‌ని కాస్త మ్యానేజ్ చేసుకుంటే చాలు మీ బరువు ఈ లేడీ మాదిరి తగ్గిపోతుంది. ఈ లేడీ 18 కేజీల బరువును కేవలం 11 నెలల్లో తగ్గింది. అందుకు సంబంధించి నాలుగు స్టెప్పుల ఫార్ములా ను ఆమె తెలిపింది.
వ్యాయామం:
బరువు తగ్గాలంటే వ్యాయామం మస్ట్ అంటుంది. వెయిట్ లాస్ కోసం ప్రతి రోజూ ఖచ్చితంగా ఓ గంట పాటు వ్యాయామం చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను చూడవచ్చు. బరువు తగ్గే వ్యాయామాలు చేయాలి. లేదంటే వాకింగ్ బెస్ట్.
నీరు:
బరువును తగ్గించడంలో వాటర్ చాలా సహాయం చేస్తాయట. ప్రతి రోజూ మీరు రెండు నుంచి 3 లీటర్ల నీరును తీసుకోవాలి. స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత ఈజీ అవుతుంది. నీరు తాగితే కొవ్వు కరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి అంటోంది ఈ మహిళ.
ఆహారం:
మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇందులో 80 శాతం పోషకాలు ఉండాలి. ఒక 20 శాతం మాత్రమే మీకు ఇష్టమైన ఫుడ్ ఉండాలి.
ఫొటోలు:
బరువు తగ్గాలి అనుకుంటే 10 రోజులకు ఒకసారి మీ ఫోటోలను మీరు దిగుతూ వాటిని చూస్తూ ఉండాలి. మీలో వచ్చే మార్పు వల్ల మీరు మరింత యాక్టివ్ గా ఈ పని చేస్తారు.