Homeలైఫ్ స్టైల్Mosquitoes Bite: ఆరోగ్యం: వానాకాలం దోమల నుంచి రక్షణ ఇలా..

Mosquitoes Bite: ఆరోగ్యం: వానాకాలం దోమల నుంచి రక్షణ ఇలా..

Mosquitoes Bite: వర్షాకాలం దోమల సీజన్‌.. ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. చిన్న దోమేకదా అని వాటితో వచ్చే జ్వరాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశముంది. దోమలతో ప్రధానంగా మలేరియా, బోధకాలు, డెంగ్యూ, చికున్‌ గున్యా, మెదడు వాపు ప్రబలుతాయి. మురుగు నీటి గుంతలు, కంపచెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వవుండే ప్రాంతాలు దోమల పెరుగుదలకు అనుకూలమైనవి. గుడ్లు, లార్వా, ప్యూపాలు నీటిలో వృద్ధి చెంది దోమగా మారి మానవులపై దాడికి సిద్ధమవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే నీటిని సక్రమంగా వినియోగించడం ప్రధానం. మానవాళిమనుగడకు అవరోధంగా మారిన దోమల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనాఫిలిస్‌ దోమ

మంచినీటి నిల్వలలో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

క్యూలెక్స్‌

మురుగు నీటి నిల్వలలో పెరిగి మెదడు వాపు, బోద కాలు వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

ఏడీస్‌

ఇంటి పరిసరాలలోని చిన్న చిన్న నీటి నిల్వలలో పెరిగి చికున్‌ గున్యా, డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

మాన్సోనియా

మెక్కలున్న నీటి నిల్వలలో పెరిగి బోద వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

అర్మిజరిన్‌

సెప్టిక్‌ ట్యాంక్‌లు, పారిశ్రామిక వ్యర్థాలలో పెరుగుతాయి. ఈ దోమలతో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందనప్పటికీ, ఇవి పీల్చే రక్తం ఎక్కువ మోతాదులో ఉండడంతో శరీరం బలహీనంగా మారుతుంది.

క్యూ లెక్స్

హఠాత్తుగా విపరీతమైన జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలలో పెరిగే క్యూలెక్స్‌ దోమతో ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రధానంగా ఈ వ్యాధి చిన్న పిల్లలకు తొందరగా సోకి మరణాలవరకు తీసుకెళ్తుంది. లేదంటే శాశ్వత అంగవైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ వ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

ఇలా చేయండి :

పంట పొలాలు, ఖాళీ స్థలాలు, పెద్ద పెద్ద మైదానాలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా జాగ్రతలు తీసుకోవాలి. వ్యాధి నివారణకు ఇచ్చే టీకాలు వేయించుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వ్యాధిగ్రస్థులను గుర్తించి సత్వరమే వైద్యసేవలు అందించాలి. చిన్న పిల్లల పట్ల ఎక్కువ జాగ్రత తీసుకోవాలి.

అనాఫిలిస్

చలి, వణుకుతో కూడిన విపరీతమై జ్వరం వస్తుంది. ప్రారంభంలో సరైన చికిత్స లేకపోతే ఈ వ్యాధి నెలల తరబడి బాధిస్తుంది. అనాఫిలిస్‌ దోమలతో వ్యాప్తి చెందే ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. గర్భిణులు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సోకితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

నివారణ

చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారించుకోవాలి. మలేరియా రకాన్ని బట్టి పూర్తి స్థాయిలో చికిత్స పొందాలి. మందుల వాడకంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎడిస్ దోమ

అకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్టుగా అనిపించి వారం, పది రోజులలో మళ్లీ తిరగబడుతుంది. ఏడీస్‌ దోమతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కళ్ల నొప్పి, శరీరంపై చిన్నపాటి దుద్దుర్లు వస్తాయి. డెంగ్యూ, చికున్‌ గున్యా వ్యాధుల లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. చిన్నచిన్న కీళ్ల వద్ద నొప్పులు విపరీతంగా వస్తాయి. నెలల తరబడి ఈ నొప్పులు బాధిస్తాయి.

ఇలా చేయండి

దోమల పెరుగుదలను అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స పొందాలి.

క్యూ లెక్స్ దోమలు

తరచూ జ్వరం వస్తుంది. చంకలు, గజ్జలలో బిళ్లలు కట్టడం, అవయాలకు వాపు లాంటివి వస్తాయి. ప్రధానంగా కాళ్లు, చేతులు, స్థనాలు, వరిబీజం, బుడ్డ, జననేంద్రియాలు చెడిపోవడం ఈ వ్యాధి లక్షణాలు. క్యూలెక్స్‌, మాన్సోనియా దోమలతో వచ్చే ఈ వ్యాధి ఎవరికైనా సోకుతుంది. వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన కొన్ని సంవత్సరాలకు లక్షణాలు కనిపిస్తాయి.

నియంత్రణ

వ్యాధి నిర్ధారణలో ఉన్న ఇబ్బందులు, సరైన చికిత్స అందు బాటులో లేకపోవడంతో నివారణే మార్గం. వ్యాధిగ్రస్థులు సంవత్సరానికి ఒక మోతాదు డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రలు మింగాలి. ఇదే చికిత్స, ఉపశమనం.

ఇవి పాటించాలి

పనికి రాని గుంతలు, లోతట్టు ప్రదేశాలు, వినియోగంలేని బావులను పూడ్చి నీరు నిల్వవుండకుండా చూడాలి.
మురుగు నీటి కాలువలలో చెత్త, చెదారం వేయకుండా, చేరకుండా చూడాలి. మురుగు నీరు కాలువలలో సజావుగా పారేట్టు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
కంప చెట్లు, పిచ్చి మెక్కలు, పెంటకుప్పలు, చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి మడుగులలో పెరిగే గుర్రపు డెక్క, తూటు కాడలతో పాటు ఇతర మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
అన్ని రకాల నీటి నిల్వలలో వారానికి ఒకసారి దోమ పిల్లల నియంత్రణ మందులు చల్లాలి.
ఫాగింగ్‌ యంత్రంతో వారానికి ఒకమారు సాయంత్రం పొగను వదలాలి.
దోమతెరలు, దోమలను పారదోలే పరికరాలు ఉపయోగించడం మంచిది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version