Kaliyugam: కలిగయుగం అంతం అప్పుడేనా? చరిత్ర ఏం చెబుతోంది?

యుగాల్లో మొదటిటి సత్య యుగం. ఈ యుగం వైవశ్యత మన్వతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభం అయింది. ఇది మొత్తం 17 లక్షల 28 వేల సంవత్సరాలు నడిచిందని శివ పురాణం చెబుతుంది.

Written By: Chai Muchhata, Updated On : August 17, 2024 5:09 pm

Kaliyugam

Follow us on

Kaliyugam: కొన్ని పురాణాలు భవిష్యత్ ను తెలుపుతాయంటారు. ముఖ్యంగా ఇవి కాలాల గురించి వివరించాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చరిత్ర ప్రకారం ప్రస్తుతం కలి యుగం నడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే మూడు యుగాలు గడిచిపోయాయని, ఇప్పుడు నాలుగో యుగం నడుస్తుందని తెలుస్తోంది. కలియుగంలో ప్రజలు కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటారు. ఇవి మితిమీరినప్పుుడు అంతం అయిపోతుందని కొన్ని విషయాల వల్ల తెలుస్తోంది. కానీ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందని అడిగితే ఎవరూ చెప్పడానికి సాహసించరు. అయితే గడిచిన మూడు యుగాలను బట్టి చూస్తే కలియుగం అంతం ఎప్పుడో తెలుస్తోంది. అదెలా అంటే?

యుగాల్లో మొదటిటి సత్య యుగం. ఈ యుగం వైవశ్యత మన్వతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభం అయింది. ఇది మొత్తం 17 లక్షల 28 వేల సంవత్సరాలు నడిచిందని శివ పురాణం చెబుతుంది. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై ఉండేది. ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా నడుచుకునేవారు. ఈ యుగానికి సూర్యుడు రాజుగా ఉండేవారు. సూర్యుడు బంగారాని అధిపతి కావడంతో ఈ యుగం మొత్తం బంగారమయం అని పేర్కొంటారు. ప్రజలు అకాల మరణాలు లేకుండా సుఖ శాంతులతో జీవించవారు.

సత్యయుగం గడిచిన తరువాత త్రేతా యుగం వచ్చింది. ఈ యుగం 12 లక్షల 96 వేల సంవత్సాలు సాగింది. ఈ యుగానికి రాజు కుజుడు. మంత్రిగా శుక్రుడు ఉండేవారు. ఈయన అన్ని విద్యల్లో ఆరి తేరిన వారు. అలాగే ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండేవారు. అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడు కుజుడికి పరమ శత్రువు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రాజ్యాన్ని భ్రష్టు పట్టించారిన చెబుతారు. శుక్రాచార్యుడు స్త్రీ వ్యామోహంతో దైవకార్యాలను అడ్డుకునేవాడు. దీంతో ధర్మం ఒక పాదం దెబ్బతిన్నదని చరిత్ర చెబుతుంది.

మూడోది ద్వారర యుగం. ఈ యుగంలో కృష్ణుడు అవతరించాల్సి వచ్చింది. ద్వారప యుగానికి రాజుగా చంద్రుడు ఉండేవారు. మంత్రి గా బుధుడు ఉన్నారు. ఈ యుగం మొత్తం 8 లక్షల 64 వేల సంవత్సరాలు సాగింది. అయితే చంద్రుడు, బుధుడికి అస్సలు పడదు. ఎందుకంటే చంద్రుడిది గురు వర్గం. బుధుడిది శని వర్గం. బుధుడు ఎక్కువగా చెడు వ్యసనాలను చేయమని కోరుతాడు. దేవతా కార్యాలను నశింపచేయిస్తాడు. రాజులకు, బ్రహ్మణులకు బేధం కల్పిస్తాడు. కానీ చంద్రుడు మాత్రం రాజులకు పారంగతులను చేసి దుష్టులను నశింప జేసేలా చేస్తాడు.

ద్వాపర యుగం రెండు భాగాలుగా చీలుతుంది. ఇందులో మొదటి భాగం పూర్తియింది. ఇప్పుడు నడిచేది రెండో భాగం. అంటే కలియుగం. కలిగయుగం కాలం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇందులో ఇప్పటికే 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం 3012 ఫిబ్రవరి 18న కలియుగం ప్రారంభమైందని అంటున్నారు. కలియుగంలో రాజు శని. మంత్రులు రాహువు, కేతువు. రాహు, కేతులకు పడదు. కానీ రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో ధర్మం నాలుగు పాదాలపై ఉండేది. కానీ రాను రాను అసత్యం పెరిగిపోయింది. ఈ యుగంలో ఎక్కువగా అధర్మానికే విలువ ఇస్తారు. అయితే కలియుగం అంతం కావడానికి 4,26,899 సంవత్సాలు ఉన్నాయి.