Skin care Tips : ఈ పండ్లు రోజు తింటే.. ముసలితనం కనిపించకుండా యంగ్ గా ఉంటారు

ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఎక్కువగా పండ్లు తింటుంటారు. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే ముసలితనం తొందరగా రాదు. వయస్సు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే.. కొన్ని రకాల పండ్లను తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాలి. మరి యంగ్ గా కనిపించడానికి రోజూ తినాల్సిన పండ్లు ఏవో మరి తెలుసుకుందాం.

Written By: Bhaskar, Updated On : September 9, 2024 12:48 pm

Skin care Tips

Follow us on

Skin care Tips :  కొందరికి వయస్సు పెరిగితే చర్మం మీద ముడతలు వస్తాయి. దీంతో యంగ్ గా కనిపించకుండా తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. వయస్సు అనేది రోజురోజుకి పెరుగుతుంది. ఎంత వయస్సు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం తినే ఫుడ్, అలవాట్లు, వ్యాయామం వంటివి అన్ని చేస్తేనే వయస్సు పెరిగిన చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల ముఖంపై తొందరగా ముడతలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఎక్కువగా పండ్లు తింటుంటారు. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే ముసలితనం తొందరగా రాదు. వయస్సు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే.. కొన్ని రకాల పండ్లను తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాలి. మరి యంగ్ గా కనిపించడానికి రోజూ తినాల్సిన పండ్లు ఏవో మరి తెలుసుకుందాం.

దానిమ్మ
దానిమ్మ పండులో పోటాషియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గింజలను తినడం వల్ల రక్తం పెరగడంతో పాటు స్కిన్ కూడా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా కాపాడంతో పాటు వయస్సు పెరిగిన యంగ్ గా ఉండేలా చేస్తుంది.

ద్రాక్ష
యవ్వనంగా ఉండేందుకు ద్రాక్ష బాగా సహాయ పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముసలితనం రాకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే ముడతలను, మచ్చలను పోగొట్టి.. స్కిన్ మెరిసేలా చేస్తుంది. వారానికి కనీసం ఒక్కసారి అయినా ద్రాక్ష తినడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

అవకాడో
ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి రేటు ఉంటాయి. కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మానికి, ఆరోగ్యానికి మేలు చేసే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు లేకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప ఛాయాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

బొప్పాయి
రోజుకి చిన్న ముక్క అయిన బొప్పాయి తింటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా కూడా ఉంటారు. ఇందులో పోపైన్ అనే ఎంజైమ్ ముడతలు రాకుండా కాపాడటంలో సాయపడుతుంది. అలాగే చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.

కివి
కివి పండ్లలో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది. ఇవి చర్మాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ డైలీ డైట్ లో వీటిని చేర్చుకుంటే.. చర్మం అందంగా తయారవుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.