Karonda health benfits : కరోండా పండ్లు ప్రయోజనాలు తెలిస్తే.. అసలు తినకుండా ఉండలేరు

ఈ పండ్లతో కొందరు ఊరగాయలు, మసాలాలు కూడా తయారు చేస్తారు. రోజుకి కనీసం ఒక పండు తీసుకున్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి చూద్దాం.

Written By: Srinivas, Updated On : September 9, 2024 5:12 pm

Karonda health benfits

Follow us on

Karonda health benfits : అరుదుగా దొరికే కరోండా పండ్లు తినడానికి ఘాటుగా, పులుపుగా ఉంటాయి. చూడటానికి ఇవి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటిపైరేటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కూలింగ్, యాంటెల్మింటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-క్యాన్సర్, యాంటీ-అల్సర్, యాంటీ స్కోర్బుటిక్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే ఈ పండ్లతో కొందరు ఊరగాయలు, మసాలాలు కూడా తయారు చేస్తారు. రోజుకి కనీసం ఒక పండు తీసుకున్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి చూద్దాం.

గుండె ఆరోగ్యం
రోజుకి ఒక కరోండా పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త పోటు అదుపులో ఉండటంతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉండటంలో ఈ పండు సాయపడుతుంది. ఈ పండు తినడం నచ్చకపోతే జ్యూస్ అయిన తాగవచ్చు. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరుగుతుంది. కాబట్టి ఏదో విధంగా రోజూ ఈ పండును తీసుకోవడం మంచిది.

బరువు తగ్గడం
ఈ పండును తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల ఆకలి వేయక..ఎలాంటి చిరు తిండ్లు తినకుండా ఉంటారు. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. రోజులో తప్పనిసరిగా ఒక పండు అయిన తింటే ఎలాంటి చిట్కాలు పాటించకుండా బరువు తగ్గుతారు.

రక్త హీనత
రక్త హీనతతో బాధ పడుతున్నవాళ్లు రోజుకి ఒక్కసారి అయిన ఈ కరోండా పండు తింటే బలంగా ఉంటారు. దీని వల్ల రక్త హీనత సమస్య తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

చర్మం ఆరోగ్యం
కరోండాలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సాయపడుతంది. అలాగే చర్మం సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది.

మానసిక ఆరోగ్యం
కరోండా పండు రోజూ తినే డైట్ లో చేర్చుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సాయపడతాయి.

జ్వరం
విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఇందులో ఉంటాయి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడంతో పాటు అధిక జ్వరాన్ని తగ్గిస్తుంది. బాగా పండిన లేదా ఎండిన కరోండా పండ్లు తినడం వల్ల తీవ్ర జ్వరం కూడా తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు
ఈ పండులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.