https://oktelugu.com/

Flax seeds : రాత్రి గింజలను నానబెట్టి తింటే.. బోలెడన్నీ ప్రయోజనాలు

నానబెట్టిన అవిసె గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. రాత్రంతా నీటిలో అవిసె గింజలను నానబెట్టి ఉంచితే కాస్త ఉబ్బుతాయి. ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండుతుంది. దీంతో చిరు తిండ్లు వంటివి తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 9, 2024 12:23 pm
    Flax seeds

    Flax seeds

    Follow us on

    Flax seeds :  ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన వాటిలో అవిసె గింజలు ఒకటి. పురాతన కాలం నుంచి ఉన్న ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈరోజుల్లో చాలా మంది వీటిని అధికంగా వాడుతున్నారు. వీటితో హెయిర్ ప్యాక్ లు ఎక్కువగా వేస్తున్నారు. వీటివల్ల తొందరగా జుట్టు పెరుగుతుందని భావించి వాడుతున్నారు. వీటిని రోజూ ఏదో విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలని పోషకాల గని అని కూడా అంటారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వీటిని రాత్రి నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి నానబెట్టి పొద్దునే తీసుకుంటే.. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. పరగడుపున తినడం వల్ల కడుపు ఖాళీ అవుతుంది. అలాగే పేగు సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్, లిగ్నన్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్ వాటర్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలంగా కూడా ఉంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

    నానబెట్టిన అవిసె గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. రాత్రంతా నీటిలో అవిసె గింజలను నానబెట్టి ఉంచితే కాస్త ఉబ్బుతాయి. ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండుతుంది. దీంతో చిరు తిండ్లు వంటివి తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు. అవిసె గింజలు అధిక రక్తపోటును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గింజల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకి కూడా అవిసె గింజలు బాగా పని చేస్తాయి. వీటిని కాస్త వేయించి తిన్నా కూడా మధుమేహం తగ్గుతుంది. అలాగే ప్రమాదకర వ్యాధులు రాకుండా అవిసె గింజలు కాపాడతాయి. వీటిని డైరెక్ట్ గా తీసుకోవడం నచ్చకపోతే.. మొలకలు లేదా పొడి చేసుకుని కూడా వాడవచ్చు. డైలీ రొటీన్ లైఫ్ లో అవిసె గింజలను తప్పకుండా చేర్చుకుంటే.. ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు చర్మం కూడా కుదుటపడుతుంది. అలాగే కురులు రాలడం తగ్గడంతో పాటు బలంగా పెరుగుతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.