https://oktelugu.com/

జూన్ నెలలో బ్యాంకు సెలవులివే.. ఎన్ని రోజులంటే..?

దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు బ్యాంక్ సెలవుల గురించి కచ్చితంగా అవగాహనను కలిగి ఉండాలనే సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులలో ఎక్కువ సంఖ్యలో బ్యాంకులు బ్యాంకు పనివేళల్లో కీలక మార్పులు చేశాయి. అందువల్ల బ్యాంకు లావాదేవీలు చేయడానికి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. సరైన అవగాహన లేని పక్షంలో బ్యాంకు లావాదేవీలు చేసేవాళ్లు ఇబ్బందులు పడక తప్పదు. సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకుంటే మంచిది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 26, 2021 5:27 pm
    Follow us on

    దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు బ్యాంక్ సెలవుల గురించి కచ్చితంగా అవగాహనను కలిగి ఉండాలనే సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులలో ఎక్కువ సంఖ్యలో బ్యాంకులు బ్యాంకు పనివేళల్లో కీలక మార్పులు చేశాయి. అందువల్ల బ్యాంకు లావాదేవీలు చేయడానికి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. సరైన అవగాహన లేని పక్షంలో బ్యాంకు లావాదేవీలు చేసేవాళ్లు ఇబ్బందులు పడక తప్పదు.

    సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్న్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రాలను బట్టి సెలవుల్లో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. జూన్ 6వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు బ్యాంకులు పని చేయవు. జూన్ 12వ తేదీన రెండో శనివారం కావడంతో ఆరోజు కూడా బ్యాంకు లావాదేవీలను నిర్వహించడం సాధ్యం కాదు.

    జూన్ 13వ తేదీ ఆదివారం కాగా 14వ తేదీన పంజాబ్, ఒడిశా రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. జూన్ 15వ తేదీన భువనేశ్వర్, మిజోరాంలలో ఉన్న బ్యాంకులు పని చేయవు. జూన్ 20 ఆదివారం కాగా జూన్ 24న కబీర్ జయంతి కారణంగా పలు రాష్ట్రాల్లో సెలవుదినంగా ఉంది. జూన్ 25న గురు హర్‌గోవింగ్ జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.

    జూన్ 26వ తేదీన నాలుగో శనివారం కాగా జూన్ 27వ తేదీన ఆదివారం సెలవు దినంగా ఉంది. జూన్ 30న రెమ్నా నే సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుదినంగా ఉంది. తెలుగు రాష్ట్రాల బ్యాంకులకు జూన్ లో ఆరు రోజులు సెలవు దినాలుగా ఉన్నాయి.