Vaccination : ఏడాదిలోపు పిల్లలకు తప్పకుండా వేయాల్సిన టీకాలు ఇవే!

పుట్టిన వెంటనే పిల్లలకు టీకా వేస్తుంటారు. అయితే పుట్టిన 24 గంటల్లోగా పిల్లలకు హెపటైటిస్ బి టీకా వేయాలి. ఇది కాలేయం ఇన్‌ఫెక్షన్ హెపటైటిస్ వ్యాధి. పుట్టిన వెంటనే టీకా వేయకపోతే ఈ వ్యాధితో జీవితాంతం బాధపడాలి. ఆ తర్వాత బిడ్డ పుట్టిన 25 రోజుల్లోగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించాలి. పోలియో నుంచి పిల్లలను విముక్తి చేయడం కోసమే ఈ టీకా వేస్తారు.

Written By: Suresh, Updated On : August 23, 2024 4:14 pm

Vaccinations

Follow us on

Vaccinations : పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెద్దయ్యాక వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి వాళ్లకి చిన్నప్పుడు టీకాలు వేయిస్తుంటారు. పుట్టినప్పటి నుంచి వాళ్లకు అయిదేళ్లు వచ్చే వరకు ఏవో ఒక టీకాలు వేస్తారు. కొందరికి తెలియక టీకాలు వేయడం మర్చిపోతుంటారు. దీంతో పిల్లలు వాధ్యుల బారిన పడతారు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకొని.. ఎప్పుడు వేయాల్సిన టీకాలు అప్పుడే వేయాలి. లేకపోతే పిల్లల వ్యాధుల బారిన పడటం ఖాయం. అయితే పిల్లలకు ఏ వయస్సులో ఎలాంటి టీకాలు వేయాలో ఈరోజు తెలుసుకుందాం.

పుట్టిన వెంటనే పిల్లలకు టీకా వేస్తుంటారు. అయితే పుట్టిన 24 గంటల్లోగా పిల్లలకు హెపటైటిస్ బి టీకా వేయాలి. ఇది కాలేయం ఇన్‌ఫెక్షన్ హెపటైటిస్ వ్యాధి. పుట్టిన వెంటనే టీకా వేయకపోతే ఈ వ్యాధితో జీవితాంతం బాధపడాలి. ఆ తర్వాత బిడ్డ పుట్టిన 25 రోజుల్లోగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించాలి. పోలియో నుంచి పిల్లలను విముక్తి చేయడం కోసమే ఈ టీకా వేస్తారు. తప్పకుండా ఈ టీకాను కూడా పిల్లలకు వేయించాలి. డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్, హెపటైటిస్ బి హేమోఫిలస్, ఇన్‌ఫ్లుయెంజా టైప్ బి. దగ్గు, తుమ్ముల నుంచి వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. దీతో కాలేయం, గుండె, కిడ్నీలు దెబ్బతింటాయి. వీటి నుంచి కాపాడేందుకు వైద్యులు పెంటావాలెంట్ టీకా వేస్తారు. అయితే ఈ టీకాను మూడు విడతలుగా వేస్తారు. ఫస్ట్ డోస్‌లో బిడ్డకి ఆరు వారాల వయస్సు లోపల వేస్తారు. రెండు, మూడు డోసులో పది వారాలు, పద్నాలుగు వారాల్లో టీకా వేయిస్తారు.

పుట్టిన గంట నుంచి ఆరునెలల లోపు ఎప్పుడైనా బీసీజీ టీకా పిల్లలకు వేయించాలి. ఈ టీకా వేయడం వల్ల టీబీ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తప్పకుండా ఈ టీకాను వేయించాలి. లేకపోతే పిల్లలు టీబీ వ్యాధి బారిన పడతారు. బిడ్డకు పది వారాల వయస్సు, 14 వారాల వయస్సు వస్తే రోటావైరస్ టీకా వేయించాలి. లేకపోతే జ్వరం, తిమ్మిర్లు, వాంతులు, విరేచనాలు వస్తాయి. న్యుమోకాకల్ వంటి ప్రమాదకర వ్యాధుల బారి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు 6 వారాల వయస్సు 14 వారాల వయస్సులో న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ వేయించాలి. మీజిల్స్, రుబెల్లా వంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఏడాదికి ముందు, రెండేళ్లకు ముందు ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వాలి. దోమలు ద్వారా పిల్లలకు జపనీస్ ఎన్ సెఫాలిటిస్ వ్యాధి సోకుతుంది. దీనికోసం పిల్లలక ఈ వ్యాక్సిన్ వేయించాలి. శిశువు 9 నుంచి 12 నెలలు ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి. విటమిన్ ఏ టీకాను పిల్లలకు తప్పకుండా వేయించాలి. ఈ టీకా వేయకపోతే పిల్లల్లో అంధత్వానికి దారితీస్తుంది. తొమ్మది నెలలు పూర్తయిన తర్వాత తప్పకుండా మొదటి డోసు వేయించాలి. లేకపోతే పిల్లలు అంధత్వ సమస్యలతో బాధపడతారు.