Harmful Health Habits : ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి పోషకాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. అవి తప్పులు అని తెలియక మనం దినచర్యలో భాగంగా చేస్తుంటాం. వాటిని సరి చేసుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఏది పడితే అది ఎలా పడితే అలా తినడం మంచిది కాదని గుర్తుంచుకుని ప్రవర్తించాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. దీనికి గాను మనం చేయాల్సినవి ఏంటో చూద్దాం.
మనలో చాలా మంది తిన్న తరవాత బ్రష్ చేస్తుంటారు. ఇది సరైంది కాదు. ఎప్పుడు కూడా మనం తినే ముందే బ్రష్ చేసుకోవాలి. తిన్న తరువాత చేయడం మంచిదికాదు. కానీ కొందరిలో ఈ అలవాటు ఉండటం సహజమే. మనం ఏదైనా తిన్న తరువాత బ్రష్ చేస్తే మన పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బ తింటుందట. దీంతో మనకు పళ్ల సమస్య రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
చాలా మంది వీకెండ్ లో ఎక్కువ సేపు పడుకుంటారు. దీంతో సమస్యలు వస్తాయి. మన దినచర్య ప్రకారమే మనం నడుచుకోవాలి. పొరపాటున కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తే మళ్లీ పాత కథే అవుతుంది. వీకెండ్ కదాని ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్ర పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. సమయానుకూలంగానే నిద్రపోవాలి తప్ప సెలవు కదా అని ఎక్కువ సేపు పడుకోకూడదు.
అధిక బరువు పెరుగుతున్నామని కొందరు భోజనం కంట్రోల్ చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. మనం తినాల్సినంత తినేయాలి. మధ్యాహ్నం భోజనం మానేసి కడుపు మాడ్చుకుంటారు. ఇలా చేస్తే అసిడిడి పెరిగి గ్యాస్ ఇబ్బందులు వస్తాయి. బరువు నియంత్రణకు పద్ధతులు పాటించాలి కానీ భోజనం మానేస్తే ఇంకా బరువు పెరగడం ఖాయం.
ఆపిల్ పండును తొక్క తీసి తింటుంటారు. కానీ తొక్కలోనే ప్రొటీన్లు ఉంటాయి. అందుకే ఆపిల్ తొక్క తీసి తినడం సురక్షితం కాదు. ఆపిల్ ను తొక్క తీయకుండానే అలానే తినేయాలి. అంతేకాదు చాలా పండ్లను కూడా తొక్క తీయకుండానే తినాలి. అరటి పండును మాత్రం తొక్క తీయాలి. ఇలా మనం ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది.