https://oktelugu.com/

Mumbai High Court : వ్యభిచారం తప్పు కాదు.. ముంబై కోర్టు సంచల తీర్పు!

వ్యభిచారంపై ముంబై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిబంధనల ప్రకారం వ్యభిచారంచేయడం తప్పు కాదని వెల్లడించింది. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో చేయడం నేరమని తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2023 / 04:40 PM IST
    Follow us on

    Mumbai High Court : వ్యభిచారంపై ముంబై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిబంధనల ప్రకారం వ్యభిచారంచేయడం తప్పు కాదని వెల్లడించింది. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో చేయడం నేరమని తెలిపింది. ఓ ఇంట్లో జరిగిన రైడ్స్‌లో పోలీసులకు పట్టుబడి అరెస్ట్‌ అయిన 34 ఏళ్ల మహిళను విడుదల చేయాలని ఆదేశించింది. ఆమె సంరక్షణ కోసం ఏడాది పాటు ఇంట్లోనే ఉంచాలని మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. స్వేచ్ఛగా తిరగడం, నివసించడం ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. తమ తీర్పును ఎవరు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ముంబై కోర్టు.
    కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు..
    ఇదిలా ఉంటే ముంబై కోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు కోర్టు తీర్పును సమర్థిస్తుంటే.. మరికొందరైతే విమర్శిస్తున్నారు. సెక్స్‌ వర్క్‌ను కూడా ఒక వృత్తిలాగానే భావించాలని అనుకూలులు వ్యాఖ్యనిస్తున్నారు. ఇది మన సంస్కృతి కాదని, దానిని ఎంకరేజ్‌ చేయొద్దని వ్యతిరేకులు పేర్కొంటున్నారు.
    గతంలో సుప్రీంకు సిఫారసు..
    వ్యభిచారం తప్పుకాదని, వ్యభిచారం చేసేవారిని అరెస్ట్‌ చేయవద్దంటూ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సంచలన సిఫార్సులను చేసింది. ఈ మేరకు సెక్స్‌ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం 2011లో నియమించిన కమిటీ తన నివేదికను వచ్చే నెలలో కోర్టు ముందు నివేదించింది. పూట గడవక, పొట్టకూటి కోసం వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించడం చట్ట వ్యతిరేకం ఏమీ కాదని, అయితే, వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రం తప్పేనని ఈ కమిటీ పలు సిఫార్సులను చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఉన్నవారిని చట్ట వ్యతిరేకులుగా భావిస్తున్నారంటూ అందులో పేర్కొంది. వృత్తిలో ఉన్న వారిని పోలీసులు కూడా వేధించరాదని సూచించింది.
    కమిటీ సిఫారసులు ఇవీ.. 
    ఈ తరహా కేసుల్లో 1956 నాటి ఐటీపీఏ (ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) చట్టంలోని సెక్షన్‌ 8ను పోలీసులు అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది.
    – ఐటీపీఏ చట్టం ప్రకారం, వ్యభిచార వృత్తిలో ఉన్న సెక్స్‌ వర్కర్లు బహిరంగంగా విటులను ఆకర్షించకూడదు.
    – అలా చేస్తే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 500 వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.
    – వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు తీసుకోవాలి.
    – ఎవరిపైనైనా సెక్స్‌ వర్కర్లు కేసు పెడితే, దాన్ని కూడా ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
    – ఇక వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ ఘోష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది.