Female Supplements : మగాళ్ల కంటే ఆడవారే ఎక్కువగా కష్టపడుతుంటారు. దీంతో వారి ఆరోగ్యం విషయంలో పట్టించుకునే వారే ఉండరు. యాంత్రిక జీవనంలో భాగంగా వారు ఇంటి పని చేసుకోవాలి. ఉద్యోగస్తులైతే ఆఫీసులో చూసుకోవాలి. ఇలా ఒళ్లంతా హూనం చేసుకుని రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతుంటారు. యవ్వనంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ వయసు పైబడుతున్న తరుణంలో వారికి జబ్బులు ఇబ్బందులు తెస్తాయి. అయినా లెక్క చేయకుండా కష్టపడతూనే ఉంటారు. వారి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధచూపించాల్సిందే.
ఐరన్ లోపం
మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఐరన్ లోపం. దీంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలసట, గోళ్లు పెలుసుగా మారడం, తీవ్ర రక్తస్రావం, తలనొప్పి వంటి లక్షణాలు వారిలో కనిపిస్తాయి. దీనికి వారు మాంసం, చేపలు, వాల్ నట్స్, బఠాణీలు, బంగాళాదుంపలు, ఆకుకూరలు వంటి వాటిని ఎక్కువగా తినాలి. అప్పుడే ఐరన్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. దీని లోపంతో చాలా మంది కష్టాలు పడుతుంటారు. భర్తలే గుర్తించి వారిని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కాల్షియం
మహిళల్లో కనిపించే మరో లోపం కాల్షియం. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సాయపడుతుంది. ఇది లోపిస్తే మహిళలకు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అలసట, తిమ్మిర్లు, సరిగా గుండె కొట్టుకోకపోవడం, శ్వాస ఆకడపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీని నుంచి బయటపడాలంటే సోయాబీన్స్, ఆకుకూరలు, పాలు, గుడ్లు, చేపలు వంటివి ఎక్కువగా తీసకుంటే కాల్షియం లోపం దూరం అవుతుంది. నువ్వుల్లో ఇంకా ఎక్కువ కాల్షియం ఉంటుంది. తరచుగా వాటిని తీసుకోవడం మంచిది.
విటమిన్ డి 3
మహిళలకు ఎక్కువగా అసవరం ఉండేది విటమిన్ డి3. ఇది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. పొద్దున పూట ఎండలో నిలబడితే విటమిన్ డి3 అందుతుంది. ఇది మనకు అవసరమైన మేరకు అందకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మన ఆరోగ్యాన్ని దారిలో పెడుతుంది. అందుకే విటమిన్ డి3 అవసరం ఎక్కువగానే ఉంటుంది.
ఫిష్ ఆయిల్
మహిళలకు మరో ప్రధాన సమస్య వేధిస్తుంది. ఇది ఫిష్ ద్వారా నయం అవుతుంది. మనకు ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్లు సరిగా అందాలంటే మనం చేపలను ఆహారంగా తీసుకోవాలి. ఇంకా ఫిష్ ఆయిల్ టాబ్లెట్లు వాడాలి. ప్రతి రోజు మన శరీరానికి 1.59 గ్రాముల ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ అవసరం. అందుకే మనం ఫిష్ టాబ్లెట్లు వాడుకుంటే శరీరానికి మంచిదే. దీంతో బలం చేకూరుతుంది. వీటి వల్ల గుండె, కన్ను, మెదడు, నాడీ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది.