Fat Health Problems: శరీరంలో ఎక్కువ కొవ్వు ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఉదయం లేచిన తర్వాత నుంచి పరుగులు, రన్నింగ్ లు అంటూ చాలా కష్టపడతారు చాలా మంది. కొందరు ఏకంగా ఫుల్ డైట్ లో ఉంటారు. శరీరంలో కొవ్వు పెరిగితే దాన్ని కరిగించడం చాలా కష్టమే. ఒక్కసారి కొవ్వు వచ్చిందంటే కొవ్వు తగ్గించుకోవడానికి కష్టపడే వారిని చూస్తే వామ్మో కొవ్వు అని భయపడాల్సిందే. చెప్పడానికి సింపుల్ గా ఉన్న ఆ బాధ బరిస్తేనే అర్థం అవుతుంది. మరి ఈ కొవ్వు వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుంటే మరింత టెన్షన్ అవుతుంది..
కొవ్వు ఎందుకు వస్తుంది..
ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారుతుంది. దీని వల్ల కొందరు ప్రాణాంతక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. నిశ్చల జీవన శైలి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యల వల్ల అధికంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అయితే శరీర పనితీరుకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ ఇందులో మంచి, చెడు కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఏదైనా ఉండాల్సిన పాళ్లల్లో ఉంటేనే శరీరానికి మంచిది. ఇక రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ఆరోగ్య సమస్యలు మరింత వచ్చే ఆస్కారం ఉంది.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే లోపలి కండరాలల్లో తిమ్మరి వస్తుందని, శరీర భాగాలు బలహీనంగా మారుతాయి అంటున్నారు నిపుణులు. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక మెదడుకు సరఫరా అయ్యే రక్తంపై ప్రభావం పడి తలనొప్పి, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయట. అంతేకాదు గ్యాస్, అజీర్ణం, చర్మంపై దురద, మగవారిలో లైంగిక శక్తి, మంట, వీర్యకణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
జాగ్రత్తలు..
కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలను తక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. తక్కువ కొలెస్ట్రాల్ ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఫ్రై చేసినా ఆహారం, నిలువ చేసిన ఆహారం వంటివి తీసుకోకపోవడం మంచిది. అంతేకాదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఏంటి అని తెలుసుకోవాలి. మీ డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకుంటూ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే నో కొలెస్ట్రాల్ నియమం పెట్టుకోండి. అతి సర్వత్రా వర్జయేత్ అని గుర్తు పెట్టుకోండి.