Allu Arjun: హీరో అంటే అందమైన రూపంతో చూడగానే అందరిని ఆకర్షించే విధంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఇక అదే విధంగా చాలా మంది మంచి ఫిజిక్ తోనే హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అవేమీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తను మొదట చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడంతో ఆయనను విమర్శించడం ఆపేశారు.
ఆయన ఎవరు ఉంటే ‘అల్లు అర్జున్’. ఈయన గంగోత్రి సినిమా చేసినప్పుడు ఆయన మీద చాలా రకాల విమర్శలైతే చేశారు. ఇక ఆర్య సినిమాతో ఆ విమర్శలకు చెక్ పెడుతూ వరుస సక్సెస్ లను అందుకోవడమే కాకుండా యూత్ ఐకాన్ గా కూడా మారిపోయాడు. ఇక అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్న కూడా తన డాన్స్ పెర్ఫా మెన్స్ తో అదరగొట్టేవాడట.
వాళ్ళ ఇంట్లో ఎవరూ కూడా డాన్స్ చేయకపోయేవారట. అయినా కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గు, భయం ఏది లేకుండా బన్నీ మాత్రం డాన్స్ ఇరగ్గొడుతూ ఉండేవాడట. ఇక ఇలాంటి క్రమం లోనే ఒకసారి తను డాన్స్ చేస్తూ ఫ్లోర్ మువ్మెంట్ వేస్తుంటే అతని మూతి నేలకు తగిలి పన్ను సగానికి విరిగిందట. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు సగం ఒరిజినల్ పన్ను అయితే సగం ఆర్టిఫిషియల్ పన్ను ను పెట్టుకొని తిరుగుతున్నాడట.
అయితే డాన్స్ అంటే ఆయనకు అంత ఇష్టం ఉండటం వల్లే తన పన్ను విరిగిపోయిన కూడా పట్టించుకోకుండా ఆ డ్యాన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత చూసుకుంటే పన్ను విరిగిపోయిందని ఆయనకు అప్పుడు తెలిసిందట. బన్నీ అలాంటి ఒక డెడికేటెడ్ పర్సన్ అవ్వడం వల్లే ఈరోజు ఆయన ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.