High BP : అందరూ కూడా తప్పకుండా పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ తింటారు. ఉదయం తినడం చాలా ముఖ్యం. కొందరు బిజీ వర్క్ వల్ల తినడం మానేస్తారు. అయితే ఎంత బిజీ అయిన కూడా అసలు బ్రేక్ ఫాస్ట్ మానకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోస, ఉప్మా వంటి టిఫిన్స్ తీసుకుంటారు. అయితే పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హైబీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ కాలం వాళ్లు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండరు. అయితే హైబీపీ ఉన్నవాళ్లు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. హైబీపీ ఉన్నవాళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైంలో కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం.
అధికంగా సోడియం ఉన్న తృణధాన్యాలు
ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది వీటిని తింటుంటారు. అయితే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అధిక సోడియం ఉన్న తృణధాన్యాలు తినకూడదు. మార్కెట్‌లో దొరికే తృణధాన్యాల్లో ఎక్కువగా ఉప్పు, సువాసన కోసం కొన్ని రసాయనాలు కలుపుతారు. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల ఇది బీపీకి అంత మంచిది కాదు. కాబట్టి సహజంగా పండించే తృణధాన్యాలను ఎంచుకోవడం ముఖ్యం.
వేపుడు ఆహారం
ఎక్కువగా హైబీపీ ఉన్నవాళ్లు వేపుడు కూరలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోకపోవడం మంచిది. వేయించిన కూరల్లో ఎక్కువగా అనారోగ్యమైన కొవ్వులు ఉంటాయి. దీనివల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు. దీనివల్ల రక్తపోటు తొందరగా పెరుగుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో వేపుడు కూరలు తీసుకోకపోవడం మంచిది.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులను ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ కింద తింటుంటారు. అయితే హైబీపీ ఉన్నవాళ్లు ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధిక కొవ్వు పాల ఉత్పత్తులకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ వంటి వాటిని తీసుకోవడం మేలు.
చక్కెర పదార్థాలు
బ్రెడ్, పెస్ట్రీ వంటి వాటిని అసలు తినకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే బరువును కూడా పెంచుతాయి. దీంతో రక్తపోటు సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ఈ పదార్థాలను అసలు తీసుకోకపోవడం మంచిది.
ఊరగాయలు
చాలా మంది పచ్చళ్లు, ఊరగాయలు ఎక్కువగా తింటారు. వీటిని హైబీపీ ఉన్నవాళ్లు అసలు తినకూడదు. ఎందుకు అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉప్పు, కారం వంటివి ఎక్కువగా వేస్తారు. వీటి వల్ల హైబీపీ వాళ్లకు సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మేలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.