Tongue Health: : మనకి ఏ చిన్న జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తుంటాం. ఇలా డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ముందుగా మన నాలుక డాక్టర్ చూస్తుంటారు. కానీ ఎందుకు చూస్తారో అనే విషయం మాత్రం మనకి అర్థం కాదు. డాక్టర్ ఇలా నాలుక రంగు చూడటం వల్ల మనకి ఉన్న అనారోగ్య సమస్యలను చెప్పగలరు. నాలుక రంగు బట్టి చూసి మనకి ఉన్న సమస్యను డాక్టర్లు చెబుతారు. నాలుక ఉండే రంగు బట్టి వచ్చే వ్యాధులను కూడా చెబుతుంటారు. అయితే ఒక్కో రోగి నాలుక వేరే రంగులో ఉంటుంది. కొందరికి నలుపు, తెల్లని మచ్చలు, నీలం, పసుపు రంగుల్లో ఉంటుంది. ఒక్కో రంగు బట్టి వాళ్లకు వేరే వ్యాధులు ఉంటాయి. అయితే ఒక రోగి నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటే వాళ్లకి ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. ఈ మచ్చలు ఎక్కువగా పెద్దవాళ్లలో, పిల్లలో కనిపిస్తాయి. నాలుక బాగా తెలుపు రంగులో ఉంటే గొంతు ఇన్ఫెక్షన్‌కి కావడం లేదా బ్యాక్టీరియాకి గురైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువగా మందులు వాడే వాళ్లకి నాలుక నల్ల రంగులోకి మారుతుంది. మధుమేహం ఉన్నావాళ్లు, క్యాన్సర్, కడుపు సమస్యలతో బాధపడుతున్న వాళ్లకి నాలుక రంగు నల్లగా ఉంటుందట. నాలుకలో మనకి ఏవైనా చిన్న లక్షణాలు కనిపించినా కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నాలుక అనేది పసుపుగా కనిపిస్తే అది పచ్చ కామెర్లకు లక్షణం అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలం లేదా గోధుమ రంగులో ఉంటే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ రంగులో ఉన్నప్పుడు గుండెకు సరిగ్గా రక్తం సరఫరా కాదు. దీంతో మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కొన్నిసార్లు మన రక్తంలో ఆక్సిజన్ లేకపోయిన కూడా నాలుక నీలి రంగులోకి మారుతుంది. కాబట్టి కొంచెం ఏదైనా ఛేంజ్ కనిపించినా వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. కొందరికీ నాలుక లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇలా ఉంటే వాళ్లకు రక్తహీనత, విటమిన్ బి12 లోపం ఉండే అవకాశం ఉంటుంది. కొందరికి నాలుక మీద తెల్లని మచ్చలు ఉంటాయి. ఇవి అధికంగా ఉంటే ల్యూకోప్లాకియా వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ఇది అంత ప్రమాదం కాదు. కానీ ఏం కాదని వదిలేస్తే ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. కాబట్టి నాలుకలో ఏ చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే ఇంకా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. కాబట్టి నాలుక విషయంలో ఎలాంటి మార్పులు కనిపించిన జాగ్రత్త తప్పదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.