Love career : ఈ చిట్కాలు పాటించి ప్రేమ, కెరీర్‌ను బ్యాలెన్స్ చేయండిలా!

కొందరు ఏవైనా సమస్యలు వస్తే పార్ట్‌నర్‌ను వదిలేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంత కష్టకాలమైన కూడా పార్ట్‌నర్‌ను సపోర్ట్ చేస్తూ తనకి తోడు ఉండాలి. అప్పుడే మీకు బంధం ఎంత స్ట్రాంగ్ తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : September 17, 2024 5:27 pm

Follow these tips and balance love career

Follow us on

Love career : ఈరోజుల్లో ప్రేమ, బ్రేకప్ వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపుగా అందరూ కూడా లవ్, బ్రేకప్ రుచి చూసే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవితంలో గొప్పగా ఎదగాలని కూడా కలలు కంటారు. అదే విధంగా వాళ్ల ప్రేమ జీవితం కూడా బాగుండాలని కోరుకుంటారు. కాకపోతే ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేరు. కెరీర్ విషయంలో గొప్పగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయలేక సతమతం అవుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో కొందరు ఏదో ఒక వైపు మాత్రమే ఉండిపోతారు. కానీ మరికొందరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. ప్రేమ, కెరీర్ కూడా వాళ్ల జీవితంలో ముఖ్యమని అనుకుంటారు. అయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చిన కూడా రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎలాగో మరి చుద్దాం.

సమయం గడపండి
ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త సమయం సెట్ చేసుకోవాలి. కెరీర్ విషయంలో బిజీగా ఉన్న ప్రేమకి కూడా రోజులో ఒక పది నిమిషాలు అయిన కేటాయించాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉంటారు. అలాగే కొందరు కెరీర్‌ను పక్కన పెట్టి ప్రేమలో మునిగిపోతుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కెరీర్ విషయం గురించి పార్ట్‌నర్‌కి అన్ని విషయాలు అర్థం అయ్యేలా చెప్పుకోవాలి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతాయి.

వారానికి ఒక రోజు కలవండి
ప్రేమ, కెరీర్‌లో.. మొదటి ప్రాధాన్యత కెరీర్‌కు ఇవ్వండి. వారానికి ఒకరోజు ప్రేమకి సమయం ఇవ్వండి. ఆరోజు పార్ట్‌నర్‌తో కలిసి బయటకు వెళ్లండి. సినిమాకి లేదా పార్క్‌కి వెళ్లి కాస్త సమయం గడపండి. ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవంటే.. కనీసం ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్లండి. ఇలా వెళ్లి మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మెరుగుపడుతుంది. ఇద్దరూ వాళ్లకు కుదిరిన సమయం సెట్ చేసుకుంటే మీకు కావాల్సిన రెండు కూడా మీతో ఉంటాయి.

ఉద్యోగ ఇబ్బందులు చెప్పవద్దు
చాలామంది వాళ్లకు ఉద్యోగంలో జరిగిన ఇబ్బందులు లేదా ఆఫీస్‌లో జరిగిన బ్యాడ్ సంఘటనల గురించి పార్ట్‌నర్‌కు చెబుతారు. మీరు ఇబ్బంది పడుతున్నారని అవతలి వాళ్లకి అనిపిస్తే.. ఉద్యోగం మానేయమని చెబుతుంటారు. కాబట్టి ఎలాంటి సంఘటనలు చెప్పాలి? ఎలాంటివి చెప్పకూడదో? తెలిసి ఉండాలి. మరీ మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పవచ్చు.

అన్ని విషయాలు చెప్పుకోండి
బంధం మెరుగుపడాలంటే.. కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కలిసి తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి గొడవలు ఇద్దరి మధ్య రాకుండా ఉంటాయి. అయితే చాలా మంది భాగస్వామితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి.

ఎలాంటి సందర్భాల్లో అయిన తోడు ఉండాలి
కొందరు ఏవైనా సమస్యలు వస్తే పార్ట్‌నర్‌ను వదిలేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంత కష్టకాలమైన కూడా పార్ట్‌నర్‌ను సపోర్ట్ చేస్తూ తనకి తోడు ఉండాలి. అప్పుడే మీకు బంధం ఎంత స్ట్రాంగ్ తెలుస్తుంది.