Dengue ; వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జలుబు, జ్వరం వంటివి చుట్టుముట్టేస్తాయి. వీటితో పాటు దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటివి కూడా వస్తాయి. అయితే ఇవి చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా డెంగ్యూ అయితే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇది దోమల ద్వారా సంక్రమణ చెందుతుంది. సాధారణ జ్వరంలా ఉన్నా కూడా ఇది చివరికి భయంకరంగా మారుతుంది. అయితే డెంగ్యూ వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత దీనిని నయం చేయడం చాలా కష్టం. కొంతమందికి తగ్గుతుంది. కానీ మరికొందరికి ప్రాణాల మీదకి తెస్తుంది. అదే డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలు ఉండవు కదా. మరి డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
దోమలు కాటు వేయకుండా ఉండాలంటే చర్మంపై నిమ్మ యూకలిప్టస్ నూనెను వాడండి. ఇవి తప్పకుండా దోమలు కాటు వేయకుండా చూస్తాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు దోమలు కరవకుండా సరైన దుస్తులు ధరించండి. షార్ట్ డ్రస్సులు కాకుండా శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం వల్ల దోమ కాటును నివారించవచ్చు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే తొలగించండి. ముఖ్యంగా పూల కుండీలు, కంటైనర్లను ఖాళీ చేయండి. అలాగే నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి. సాయంత్రం పూట బయటకు వెళ్లడాన్ని తగ్గించండి. వర్షాలకు బయట దోమలు ఎక్కువ అవుతాయి. దీంతో మీకు కాటు వేస్తాయి. అదే బయటకు వెళ్లకుండా ఉంటే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు చిన్న తెరలను వాడండి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. లేకపోతే ప్రమాదం తప్పదు. ఇంట్లో కాయిల్సో, దోమల మందు వాడకుండా ఇంటి బయట వాటిని వాడండి. వర్షాకాలంలో గోడలపై తేమ ఉంటుంది. వీటిని క్లీన్ చేయండి. సరదాగా కూడా వర్షంలో తడవద్దు. బయట ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్క్ వాడండి. ఈ కాలంలో కేవలం గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి. చల్లని నీటికి దూరంగా ఉండండి. జలుబు చేసే పదార్థాలను అతిగా తినకండి. జలుబు చేస్తే ఆటోమెటిక్‌గా ఫీవర్ వస్తుంది. సీజనల్ కాబట్టి అది కాస్త వైరల్‌గా మారి డెంగ్యూ రావచ్చు. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Take these precautions to prevent dengue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com