Headaches : తలనొప్పి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. కొన్ని కారణాల వల్ల ఈ తలనొప్పి వస్తుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ కచ్చితంగా ఈ పెయిన్ ను చూసే ఉంటారు. చాలా సార్లు సీవియర్ గా వస్తే కొన్ని సార్లు ఇలా వచ్చి అలా పలకరించి కూడా వెళ్లిపోతుంది. కానీ రావడం మాత్రం పక్కా అంటుంది తలనొప్పి. ప్రయాణాలు చేయడం, ఎక్కువగా థింక్ చేయడం, ప్రెజర్ తీసుకోవడం, ఒత్తిడి వంటి చాలా కారణాల వల్ల ఈ హెడెక్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఈ తలనొప్పిని తట్టుకోవడం కూడా అంత సులభం కాదు కదా. సో మెడిసిన్స్ వేసుకుంటారు చాలా మంది. కానీ ఎక్కువగా మెడిసిన్ వాడటం కూడా మంచిది కాదు. అందుకే ఇలాంటి పెయిన్స్ ను సహజంగానే తరిమి కొట్టాలి. మరి ఎలా అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి. ఈ ఎఫెక్టివ్ రెమెడీస్‌తో సహజంగానే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
నీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ చాలా మంది తగినంత నీరు తీసుకోరు. తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ఒక సాధారణ కారణం అంటున్నారు నిపుణులు. బాడీ డీహైడ్రేట్ కాకుండా కావాల్సినంత నీరు తాగాలి. దీని వల్ల తలనొప్పి రాకుండా ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల కూడా తలనొప్పిని తరిమి కొట్టవచ్చు. పిప్పరమింట్ లేదా లావెండర్ ఆయిల్ ఉపశమనాన్ని అందిస్తుంది. వీటితో హెడ్ మసాజ్ చేసుకోండి. మసాజ్ వల్ల చాలా రిలీఫ్ వస్తుంది.
ఉష్ణోగ్రత చికిత్సతో మీ తల కండరాలను శాంతపరచాలి. ఇలా చేయడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయండి. ఈ వ్యాయామాలు చాలా రిలీఫ్ ను ఇస్తాయి. తలనొప్పితో సహా చాలా సమస్యలను తగ్గిస్తాయి బ్రీతింగ్ ఎక్సైర్ సైజ్ లు. మీ మనస్సును శాంతపరచి టెన్షన్ తలనొప్పిని తగ్గిస్తాయి. మెగ్నీషియం-రిచ్ ఫుడ్స్ ను మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. బచ్చలికూర లేదా గింజలతో మైగ్రేన్‌లను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. సో ఈ విషయాన్ని నెగ్లెట్ చేయవద్దు.
తగినంత నిద్ర పోవడం మాత్రం చాలా అవసరం. లేదంటే తలనొప్పి మాత్రమే కాదు మరెన్నో సమస్యలు వస్తాయి. మంచి నిద్ర వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. బాగా విశ్రాంతి తీసుకుంటే తలనొప్పికి తక్కువ అవకాశం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మీ పక్కన ఫోన్ ను ఉంచవద్దు. లేదంటే ఆ మాయాజాలంలో పడిపోయి మీ నిద్ర ఆరోగ్యం రెండింటిని పాడు చేసుకుంటారు. హెర్బల్ టీని ప్రయత్నించండి దీని వల్ల కూడా మీ తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అల్లం లేదా చమోమిలే టీ అద్భుతాలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. చాలా మందికి టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.