Alien temple: సాధారణంగా దేవుడి మీద భక్తితో కొందరు ఆలయం నిర్మిస్తారు. మరికొందరు బాగా ఇష్టమైన వారికి ఆలయాన్ని నిర్మిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది సినిమా హీరోలు అంటే ఇష్టంతో వీరికి ఆలయాన్ని నిర్మిస్తుంటారు. అయితే ఇదంతా వారికి ఇతరులపై ఉన్న ప్రేమ, అభిమానమని చెప్పుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా ఏలియన్స్‌కి ఆలయాన్ని నిర్మించాడు. తమిళనాడులోని ముల్లముపంబట్టిలోని లోగనాథన్ అనే ఒక అతను గ్రహాంతర వాసుల కోసం నిర్మించాడు. అయితే ఈ ఆలయం కట్టడానికి అనుమతి ఎవరూ ఇచ్చారని అడిగితే.. ఏలియన్స్‌తో మాట్లాడి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఆలయాన్ని తనకి ఉన్న పొలంలోనే నిర్మించాడు. మొత్తం మూడు ఎకరాలు ఉండే పొలంలో 11 అడుగుల లోపల శివుడు, పార్వతి, కాళీమాత, మురుగన్, ఏలియన్స్ విగ్రహాలను నిర్మించాడు. దీంతో దేశ ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే అసలు ఏలియన్స్ ఉన్నాయో లేదో కూడా సరిగ్గా తెలియదు. అలాంటి వాటి గురించి ఆలయం నిర్మించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
లోగనాథన్ ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఓ ముఖ్య కారణం కూడా ఉందట. ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో వారి కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆపే శక్తి ఏలియన్స్‌కు శక్తి ఉందని లోగనాథన్ నమ్ముతారు. ఏలియన్స్‌ను పూజించడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయట. అయితే ఏలియన్స్ అంటే సినిమాల్లో ఉన్నట్లు ఉండవని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. తాను ఏలియన్స్‌ను ఎలా పూజిస్తాడో కూడా తెలిపాడు. అయితే ఏలియన్స్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి తప్పించుకోవాలంటే అరటి ఆకు బాగా సాయపడుతుందని తెలిపాడు. తాజాగా ఉండే అరటి ఆకును తీసుకుని శరీరానికి చుట్టుకుంటే రేడియేషన్ నుంచి ఈజీగా విముక్తి చెందవచ్చని తెలిపారు.
ఈ ఆలయాన్ని నిర్మించే ముందు ఏలియన్స్ పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపాడు. వాటి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఏలియన్స్‌కి ఆలయం నిర్మించడంతో చాలా మంది ఈ టెంపుల్‌ను చూడటానికి వెళ్లేవారు. అసలు ఏలియన్స్‌కి ఆలయం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అయిన దేవుడి మీద ఎవరి అభిప్రాయం వాళ్లదని కొందరు భావిస్తున్నారు. అయితే ఏలియన్స్‌తో మాట్లాడనని, అందుకే ఆలయం కడుతున్నానని అనడంతో చాలా మంది కంగు తిన్నారు. అరే అసలు ఏలియన్స్‌తో మాట్లాడటం ఏంటని సందేహంలో పడిపోయారు. మరి ఈ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? మీరు వీటిని నమ్ముతారా? ఏంటనే విషయంపై కామెంట్ చేయండి.