Liver Problem: మనం ప్రతిరోజు తినే ఆహారం జీర్ణం అయితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా సక్రమంగా జీర్ణం కానీ సమయంలో కడుపు ఉబ్బరంగాను.. వికారమైన మనస్తత్వంతో ఉంటాం. ఇలాంటి సమయంలో ఏదైనా నీరు తాగితే బాగుండు అని అనిపిస్తుంది. అయితే అప్పటికే కల్పిత ఆహారము లేదా మసాలా, ఆయిల్ తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో ఇటువంటి పదార్థాలు తీసుకున్న జీర్ణించుకునే శక్తి ఉంటుంది. కానీ మరికొందరిలో మాత్రం ఏ చిన్న ఆయిల్ ఫుడ్ తీసుకున్న సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య ఇలాగే కొనసాగి కాలేయ వ్యాధి కి గురయ్య అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలేయ వ్యాధిని గుర్తించడానికి ముందుగానే కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయంటే?
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న వ్యాధి పేరు ఫ్యాటీ లివర్. శరీరంలో జీర్ణక్రియను సక్రమంగా సాగించే లివర్ వాపు కు వస్తే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. అంటే తిన్న ఆహారం చాలా నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా జీర్ణం అయ్యే క్రమంలో అలసట ఏర్పడుతుంది. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకున్నా.. ఎంతో ఆహారం తీసుకున్నట్లు అనిపిస్తుంది. నీతో శరీరానికి అవసరమైన శక్తిని అందించదు. శరీరంలోని పేగులు కొవ్వుతో నిండిపోతాయి. ఇవి బలవంతంగా జీర్ణం చేస్తాయి.
ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే క్రమంలో చెస్టులో ఒకవైపు మంటగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక తీవ్రమైన నొప్పి వస్తూ పొత్తికడుపులో తేలికపాటి నొప్పి ఉంటుంది. ఈ నొప్పి భోజనం చేసిన తర్వాత ఎక్కువవుతుంది. భోజనం చేసిన తర్వాత పడుకున్నప్పుడు ఇది మరింత బాధ పెడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
అనుకోకుండా బరువు తగ్గుతూ ఉండడం.. ఆకలి లేకపోవడం.. వంటి లక్షణాలు ఉన్నా.. ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఫ్యాటీ లివర్ వ్యాధి పెరిగే కొద్దీ శరీరానికి పోషకాలు అందకుండా పోతాయి. దీంతో అకస్మాత్తుగా ఆకలి వేయడం తగ్గుతుంది. ఏ ఆహారం అయినా తినడానికి ఆసక్తి ఉండదు. ఈ క్రమంలో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి లక్షణం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
నోట్లో ఎప్పుడూ వికారంగా ఉండి.. పదేపదే వాంతులు వస్తున్నా.. ఫ్యాటీ లివర్ లక్షణం అని చెప్పవచ్చు. ఈ సమయంలో కడుపు ఎప్పుడూ చికాకు గా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరంలో ఏవో పదార్థాలు పేరుకుపోయినట్లు మనసు ఆందోళనగా ఉంటుంది. ఏ సమయంలో ఏదైనా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపులో జీర్ణం కాక వెంటనే వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది.
మనం ప్రతిరోజు విషాజన చేసే మలంలో కూడా మార్పులు ఉంటున్నాయి అంటే అందుకు కారణం ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. కానీ బూడిద రంగులో లేదా ఇతర రంగులో మారినప్పుడు కూడా వ్యాధి ప్రభావం ఉన్నట్లు గుర్తించుకోవాలి. అందువల్ల ఎటువంటి లక్షణాలు ఉంటే వెంటనే రైతులను సంప్రదించాలి.