Summer Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే అవసరం. మానవ శరీరంలో ఒక వంతు మాత్రమే నీరు ఉంటుంది. అయితే ఈ నీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి కొంత భాగం రక్తంలోకి మరికొంత భాగం మూత్ర విసర్జన అలాగే చెమట ద్వారా బయటికి పోతుంది. ఇలా శరీరంలో ఉన్న నీరు బయటకు వెళ్లడం ద్వారా శరీరం డిహైడ్రేషన్కు గురి అవుతుంది. ఇలాంటి సమయంలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఏర్పడి అనేక ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వేసవిలో మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొందరు శరీరానికి అవసరమయ్యే నీటి కంటే తక్కువగాను.. మరికొందరు ఎక్కువగాను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎంత మాత్రం ఆరోగ్యం కాదని అంటున్నారు. అసలు శరీరానికి నీటి అవసరం ఎంత? రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?
Also Read: గూగుల్ ఆధిపత్యానికి చెక్.. సీసీఐ కీలక నిర్ణయం..
అమెరికన్ నేషనల్ రీసెర్చ్ ఫుడ్ న్యూట్రిషన్ సూచించిన నిబంధనల ప్రకారం ప్రతి కేలరీ ఆహారానికి ఒక మిల్లీలీటర్ నీటిని తీసుకోవాలని సూచించింది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకోవాలని ఈ సంస్థ పేర్కొంది. అయితే ఈ నీరు రోజు తీసుకునే ఆహారం పండ్లతో పాటు అని పేర్కొంది. ఒకవేళ ఒకేసారి రెండు లీటర్ల నీటిని సాధ్యం కాకపోతే సమయాన్నిబట్టి మొత్తం ఎనిమిది గ్లాసుల నీరుని తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ నీటిని అందరూ ఒకేలాగా కాకుండా కొందరు ప్రత్యేక వ్యక్తులు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. క్రీడాకారులు, ఎత్తయిన ప్రదేశంలో ఉండేవారు, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వారు మిగతా వారి కంటే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా సాధారణ ప్రదేశాల్లోని వారు సైతం ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువ నీటిని తీసుకుంటూ ఉండాలి.
శరీరంలో కనీసం రెండు శాతం నీటిని కోల్పోతే డీహైడ్రేషన్కు గురి అవుతూ ఉంటారు. ఈ డిహైడ్రేషన్ రాకముందే నీరు తీసుకోవాలని మెదడు గుర్తిస్తుంది. అంటే ఆ సమయంలో దాహం అవుతూ ఉంటుంది. ఒకవేళ దాహం అయినా నిర్లక్ష్యం చేస్తూ నీటిని తీసుకోకుండా ఉండడంవల్ల డీహైడ్రేషన్కు గురవుతారు. అయినా కూడా నిర్లక్ష్యం చేస్తే మరింత అనారోగ్యానికి గురై అవకాశం ఉంది.
ప్రతిరోజు అవసరమైన నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజు రెండు లీటర్ల నీటిని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే మృత కణాలను కూడా తగ్గించుకొని వయసు తొందరగా అయిపోయినట్లు అనిపించదు. ఎక్కువ వయసులోనూ చురుగ్గా ఉండగలుగుతారు. నీటి శాతం శరీరంలో ఎప్పుడు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అయితే నీరు శరీరానికి ఎంత అన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీరు తాగినా శరీరానికి ప్రమాదమే అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం శాతం తగ్గిపోతుంది. దీనిని హైపోనట్రీమియా అని అంటారు. ఇది శరీరంలో ఎక్కువగా ఏర్పడితే ఆస్పత్రిలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల శరీరానికి అవసరమైన నీటిని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇది మీకు ఉపయోగమేనా తెలుసుకోండి