Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ( duvvada Srinivas) వేటుపడిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ కట్టు దాటారంటూ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు దిగింది పార్టీ హై కమాండ్. నిన్ననే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దానిని కారణంగా చూపుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!
* ప్రత్యేక వీడియో విడుదల
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఈ హోదా తనకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని.. పార్టీ గొంతై మాట్లాడానని.. పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేశానన్నారు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు. ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం మరువలేని దన్నారు. రాజశేఖర్ రెడ్డి అడుగులతో అడుగులు వేసిన తాను జగన్మోహన్ రెడ్డితో సైతం నడిచిన విషయాన్ని ప్రస్తావించారు. తన హృదయంలో జగన్ స్థానం సుస్థిరం అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎమోషనల్ అయ్యారు.
రాజకీయ క్రీనీడలో తాను బలయ్యానని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజాసేవనే పరమావధిగా భావించానని చెప్పారు. ఏ రోజు పార్టీకి ద్రోహం చేయలేదని.. లంచాలు తీసుకోలేదని.. అవినీతి చేయలేదని.. భూ కబ్జాలు చేయలేదన్నారు. జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లు దువ్వాడ ప్రకటించారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు. విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చేసిన ఓ మాటను ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ గుర్తు చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన ప్రజల మధ్య బలంగా తిరుగుతానని.. వారి మంచి చెడుల్లో తాను ఉంటానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు.
సస్పెన్షన్ పై దువ్వాడ రియాక్షన్…
నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన @ysjagan కు ధన్యవాదాలు.. నా మనసులో జగన్ ఎప్పుడు చిరస్మరణీయం.
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే.. త్వరలోనే మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వస్తాను – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్#YSRCongressParty pic.twitter.com/kXpDiOPYTP
— greatandhra (@greatandhranews) April 24, 2025
* పార్టీ గుర్తిస్తుందని ఆశాభావం..
అయితే కొద్ది రోజుల కిందట టెక్కలి( tekkali ) అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాసును తప్పించారు. తిలక్ అనే నేతకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇప్పటికీ పార్టీ పట్ల విధేయత చూపుతూ వస్తున్నారు. సస్పెన్షన్ అనేది స్వల్ప విరామం అని చెబుతున్న దువ్వాడ శ్రీనివాస్… మళ్లీ పార్టీ హై కమాండ్ తనను గుర్తిస్తుందన్న ఆశ భావంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.