చక్కెర ఎక్కువగా తినేవాళ్లను దంతక్షయం ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. చక్కెర తినడాన్ని పూర్తిగా మానేస్తే దంతక్షయం సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకోని వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని తేల్చారు. బరువు తక్కువగా ఉన్నవాళ్లు చక్కెర తినడం మానేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.
చక్కెర పూర్తిగా తినడం మానేస్తే బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. చక్కెర శరీరంలో గ్లూకోజ్ కు మూలం అనే విషయం తెలిసిందే. చక్కెరను తినడం మానేసినా పండ్లు, ధాన్యాలు ఇతర తీపి పదార్థాలను తీసుకోవాలి. అయితే డైటీషియన్ సూచనల మేరకు మాత్రమే చక్కెరను మానేస్తే మంచిది. చక్కెరను పూర్తిగా విడిచిపెడితే శరీరం కార్బోహైడ్రేట్లను చక్కెరగా విచ్చిన్నం చేస్తుంది.
చక్కెరను మానేసిన వాళ్లలో కొంతమంది బద్ధకం మరియు అలసటతో బాధ పడతారు. చక్కెర మానేసిన వాళ్ల శరీరంలోని కొవ్వును అడ్రినలిన్ అనే హార్మోన్ విచ్చిన్నం చేస్తుంది. ప్రజలు పూర్తిగా చక్కెరకు దూరమైతే బరువు తగ్గడానికి ఇదే కారణమవుతుంది.