Kalonji Farming: కలోంజి సాగుతో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా సాగు చేయాలంటే?

Kalonji Farming: ప్రపంచంలో కొన్ని వందల ఔషధ మొక్కలు ఉండగా ఆ మొక్కలలో కలోంజి కూడా ఒకటి. కలోంజి మొక్కల ద్వారా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కలోంజి విత్తనాల ద్వారా అందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుండగా నలుపు రంగులో కలోంజి విత్తనాలు ఉంటాయి. రుచి విషయంలో మాత్రం కలోంజి గింజలు ఘాటుగా ఉంటాయి. కేకులు, బ్రెడ్, ఊరగాయలలో కలోంజి గింజలను ఎక్కువగా వినియోగిస్తారు. ఇసుక నేలలలో కలోంజిని ఎక్కువగా సాగు చేస్తారు. […]

Written By: Kusuma Aggunna, Updated On : September 20, 2021 1:55 pm
Follow us on

Kalonji Farming: ప్రపంచంలో కొన్ని వందల ఔషధ మొక్కలు ఉండగా ఆ మొక్కలలో కలోంజి కూడా ఒకటి. కలోంజి మొక్కల ద్వారా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కలోంజి విత్తనాల ద్వారా అందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుండగా నలుపు రంగులో కలోంజి విత్తనాలు ఉంటాయి. రుచి విషయంలో మాత్రం కలోంజి గింజలు ఘాటుగా ఉంటాయి. కేకులు, బ్రెడ్, ఊరగాయలలో కలోంజి గింజలను ఎక్కువగా వినియోగిస్తారు.

ఇసుక నేలలలో కలోంజిని ఎక్కువగా సాగు చేస్తారు. పీహెచ్ విలువలు 6 నుంచి 7 మధ్యలో ఉన్న నేలలో కలోంజి సాగు చేయాల్సి ఉండగా ఈ పంటను సాగు చేయాలంటే సేంద్రీయ పదార్థాలను వినియోగించాలి. వేసవి, శీతాకాలంలో ఉష్ణమండల వాతావరణంలో ఈ పంట సాగు జరుగుతుంది. మంచి దిగుబడి పొందాలని అనుకునే వాళ్లు విత్తనాలు నాటిన వెంటనే నీటిని అందించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కలోంజి సాగుకు సరైన సమయమని చెప్పవచ్చు. ఈ పంటకు కేవలం రెండు లేదా మూడుసార్లు కలుపు తీస్తే సరిపోతుంది. విత్తనాలు నాటిన తర్వాత తెగులు వస్తే క్లోరిపైరిఫాస్ ను పిచికారీ చేస్తే మంచిది. నీటి నిల్వ జరగకుండా చూడటం వల్ల రూట్ రాట్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. రూట్ రాట్ వ్యాధి వల్ల ఆకులు పచ్చగా మారి మొక్క మూలాలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.

కలోంజి విత్తనాలు నాటిన 130 నుంచి 140 రోజుల తర్వాత పండిన మొక్కలను వేరుతో పాటు భూమి నుంచి వేరు చేయాలి. ఆ తర్వాత మొక్కలను ఎండలో ఆరబెట్టాలి. మొక్కలు ఎండిన తర్వాత చెక్క సహాయంతో విత్తనాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ పంట ద్వారా సులభంగ లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది.