ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎంతోమందిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. గుండె సమస్యలతో బాధ పడేవాళ్లు వైట్ రైస్ కు బదులుగా బ్లాక్ రైస్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అధిక బరువుతో బాధ పడేవాళ్లు బ్లాక్ రైస్ ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఫిట్ గా ఉండాలనుకునే వాళ్లు సైతం బ్లాక్ రైస్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
మన దేశంలో నల్ల బియ్యం సాగు తక్కువగా జరుగుతుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే నల్ల బియ్యం ఖరీదు ఎక్కువనే సంగతి తెలిసిందే. నల్లబియ్యంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల బియ్యం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఐరన్ లోపం సమస్యతో బాధ పడేవాళ్లు నల్లబియ్యం తినడం వల్ల ఆ సమస్యను సులభంగా అధిగమించే అవకాశం ఉంటుంది.
సాధారణ బియ్యం ఎంత రుచిగా ఉంటుందో నల్ల బియ్యం కూడా అంతే రుచిగా ఉంటుంది. అలసట, బలహీనత సమస్యలతో బాధ పడేవాళ్లు నల్లబియ్యం తినడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. నల్లబియ్యంలో శరీరానికి అవసరమైన ఫైబర్ లభించడంతో పాటు నల్లబియ్యం ద్వారా అల్జీమర్స్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు నల్లబియ్యం తినడం వల్ల షుగర్ లెవెల్స్ ను అదుపులో పెట్టుకోవచ్చు.
నల్లబియ్యం గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో నల్లబియ్యం ఉపయోగపడుతుంది. బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసైనిన్ అనే మూలకం గుండె సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.