weight Loss : అకస్మాత్తుగా బరువు తగ్గితే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!

కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఒక్కసారిగా బరువు తగ్గితే కారణం అనారోగ్య సమస్యలే అని వైద్యులు చెబుతున్నారు. మరి ఏ అనారోగ్య సమస్యలు ఉంటే బరువు తగ్గుతారో తెలియాలంటే పూర్తిగా స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : September 19, 2024 5:32 pm

Sudden weight Loss

Follow us on

Weight Loss :  బరువు అదుపులో ఉండి ఫిట్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఎక్కువ బరువు ఉండకూడదు. అలా అని తక్కువగా కూడా ఉండకూడదు. వయస్సుకు తగ్గట్లు బరువు అనే మెయింటైన్ చేయాలి. అయితే కొందరు ఎక్కువ బరువు ఉంటారు. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. వ్యాయామం, యోగా వంటివి చేస్తారు. కానీ అసలు బరువు తగ్గరు. బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలు అన్ని వృథా అయిపోతాయి. అయితే కొందరు మాత్రం ఎలాంటి నియమాలు పాటించకుండా అకస్మాత్తుగా ఒక్కోసారి బరువు తగ్గుతారు. ఇలా సడెన్‌గా బరువు తగ్గితే.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఒక్కసారిగా బరువు తగ్గితే కారణం అనారోగ్య సమస్యలే అని వైద్యులు చెబుతున్నారు. మరి ఏ అనారోగ్య సమస్యలు ఉంటే బరువు తగ్గుతారో తెలియాలంటే పూర్తిగా స్టోరీ మొత్తం చదివేయండి.

మానసిక సమస్యలు
శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నా.. మానసికంగా ఇబ్బందులు ఉంటే ఒక్కసారిగా బరువు తగ్గిపోతారట. మానసికంగా కుంగిపోతే దాని ఎఫెక్ట్ బరువు మీద పడుతుంది. ఈరోజుల్లో చాలామంది డిప్రెషన్, ఆందోళనతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఉంటే వెంటనే బరువు తగ్గుతారు. కాబట్టి మీకు అకస్మాత్తుగా బరువు తగ్గినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మేలు.

మందులు ఎక్కువగా తీసుకున్నవాళ్లు
శారీరకంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మందులు తీసుకుంటారు. ఇలా ఎక్కువగా మందులు తీసుకోవడం ఆ మందుల ప్రభావం బరువు మీద పడుతుంది.

థైరాయిడ్
ఈరోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఒక్కసారిగా బరువు తగ్గుతారు. నిజం చెప్పాలంటే వాళ్లకి తెలియకుండానే బరువు తగ్గుతారు. అయితే థైరాయిడ్ ఉన్న కొందరిలో బరువు కూడా పెరుగుతారు.

క్యాన్సర్
చాలామంది ఈ మధ్య కాలంలో క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు. రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్లు ఒక్కసారిగా బరువు తగ్గుతారు.

మధుమేహం
డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా సడెన్‌గా బరువు తగ్గుతారు. షుగర్ వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దీనివల్ల తొందరగా బరువు తగ్గుతారు.

జీర్ణ సమస్యలు
కొందరికి తినే ఆహారం జీర్ణం కాదు. అలాగే కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్లు కూడా ఒక్కసారిగా బరువు తగ్గుతారు. కాబట్టి ఏ మాత్రం అకస్మాత్తుగా బరువు తగ్గినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వివిధ టెస్ట్‌లు చేసి మీకు ఉన్న సమస్యలను వైద్యులు చెబుతారు. లేకపోతే సమస్య తీవ్రం అయి.. మీకు ఇంకా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.q