Kajal On Eyes: ఫేస్ లో అట్రాక్ట్ గా నిలిచే అవయవాలలో కళ్లు కూడా ప్రధానమైనవే. కొందరి కళ్లు చాలా మందిని అట్రాక్ట్ చేస్తాయి. ఇలాంటి కళ్లు ఉన్న వాళ్లు బలే అందంగా కనిపిస్తారు కదా. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. అయితే కళ్లు అందంగా లేకపోయినా సరే అందంగా మార్చుకునే అవకాశం ఉంది కదా అనుకుంటున్నారా? యస్ ఉంది. ప్రస్తుతం ఇంట్రెస్ట్, టైమ్, కాస్త మనీ ఉంటే ప్రతి పార్ట్ ను అందంగా మార్చుకోవచ్చు. ఇక అందమైన కళ్లకు మరింత అందం జోడిస్తే ఫేస్ అట్రాక్షన్ గా ఉంటుంది కదా. మరి కళ్లను అందంగా మార్చడానికి మీరు కాజల్ ను వాడుతున్నారా? అయితే కండ్లకు కాజల్, ఐ లైనర్.. అప్లై చేస్తే కళ్ళు అందంగా కనిపిస్తాయి అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇలా ప్రతిసారి ఎక్కువ కాజల్ అప్లే చేయడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడతారు మరి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రజెంట్ మార్కెట్‌లో చాలా ఐలైనర్స్ అందుబాటులో ఉన్నాయి.. ఇవి ఎక్కువరోజులు ఉండటానికి కెమికల్స్ కలుపుతుంటారు. అంతేకాదు ఎక్కువ బ్లాక్ కలర్‌లో కనిపించేందుకు కూడా వీటిలో కెమికల్స్ కలుపుతున్నారట. వీటి వల్ల మీ కళ్ళకి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్ళలోని వాటర్ లైన్‌కి కాజల్,ఐలైనర్ రాయడం చాలా మందికి అలవాటే. అయితే ఇలా చేసినప్పుడు అక్కడ ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో అక్కడ స్రవించే కొన్ని యాసిడ్స్ బయటకు రావు. అప్పుడు ఆ యాసిడ్స్ అక్కడే చిక్కుకుపోతాయి.
యాసిడ్స్ బయటకు రాకుండా రెగ్యులర్‌గా అలానే కొనసాగితే కణితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. రోజూ కళ్ళపై ఐ లైనర్ వాడేవారు దీనిని పెద్దగా పట్టించుకోకపోతే కార్నియల్ అల్సర్స్ కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. దీనివల్ల దృష్టి సమస్యలు, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మార్కెట్లో దొరికే కాజల్, ఐలైనర్ పెన్సిల్స్‌ని కళ్ళకి వాడే ముందు చేతులపై ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్.
రోజూ కాజల్ వాడేవారు కళ్లను దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోండి. అలాగే కెమికల్ మేకప్ ప్రోడక్ట్స్ కు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో తయారు చేసిన కాజల్ వాడటం మరీ మంచిది. ఇక లైనర్ కాజల్ ను పెట్టుకుంటే రోజూ రాత్రి పడుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడం కచ్చితంగా అలవాటు చేసుకోండి. అలాగే ఉంచుకొని నిద్రపోవద్దు. లేదంటే సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ. వేరేవారు వాడిన ప్రొడక్ట్స్ అసలు వాడకండి. కళ్ళని నీటితో మాత్రమే కడుక్కోవాలి. కళ్ళు వాపు, చిరాకు, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.