Health Tips: వామ్మో ఎండకాలం వచ్చింది.. బయట పెనం పెట్టి దోశలు వేసినా, చపాతీలు చేసినా వెంటనే రెడీ అవుతాయి కావచ్చు. ఆ రేంజ్ లో ఎండలు దంచేస్తున్నాయి. మరి ఇలాంటి ఎండలో చల్లదనం కావాలంటే ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తున్నాయా అంటే.. అడ్జెస్ట్ అవ్వాల్సిందే. కాస్త డబ్బులు ఉంటే ఈఎమ్ ఐలు అంటూ కొనవచ్చు.అయితే ఏసీల కింద ఉంటే ఆరోగ్యానికి హానీకరం అని తెలుస్తోంది. ఏసీలకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం పదండి.
ఎయిర్ కండీషన్ల చల్లదనం వల్ల ఎక్కువ సేపు ఏసీలోనే ఉండాలి అనిపిస్తుంది. కానీ అలా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ పక్కా అంటున్నారు. అయితే ఏసీలు గదిలో ఉండే తేమను మాయం చేస్తాయట. అదే విధంగా శరీరంలోని చెమటను కూడా పోగొడతాయి. అంటే స్కిన్ డ్రై అవుతుంది. కళ్లు కూడా పొడిబారి దురద వస్తుంటుంది. అతిగా ఏసీలో ఉంటే.. వాతావరణం మార్పులు త్వరగా ప్రభావం చూపుతాయట. దీని వల్ల నెలలో 1 నుంచి 3 రోజులు తలనొప్పి కూడా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
గంటల తరబడి ఏసీలో ఉండడం మంచిది కాదట. త్వరగా అలిసిపోతారట కూడా. చివరకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు కూడా వస్తాయట. తొందరగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అయితే ఏసీలో త్వరగా తేమను తాగేసుకోవడం వల్ల వ్యక్తులు త్వరగా డీహైడ్రేట్ అవుతుంటారు. దీని వల్ల శరీరంలో నీరు లేక కిడ్నీలు కూడా సరిగా పనిచేయవు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినడం మాత్రమే కాదు.. కిడ్నీలలో రాళ్లు కూడా ఏర్పడుతుంటాయి.
ఏసీ నుంచి అనారోగ్య సమస్యలు రావద్దంటే.. ఏసీలో ఎక్కువ సేపు ఉండకపోవడమే మంచిది. ఏసీ టెంపరేచర్, బయటి ఉష్ణోగ్రతకు మధ్య 4 నుంచి 6 డిగ్రీల కంటే ఎక్కవ తేడా లేకుండా చూసుకోవాలి. అంటే బయట 30 డి. సెల్సియస్ ఉంటే ఏసీ ఉష్ణోగ్రత 24 డి. కంటే తగ్గించవద్దు అంటున్నారు నిపుణులు. తరచుగా నీరు తాగుతూనే ఉండాలి.