https://oktelugu.com/

Maruti Suzuki Dizer : మారుతి సుజుకీ డిజైర్.. ఇప్పుడు ఇక EV.. ఫీచర్లు, ధర ఎంత అంటే?

సబ్ 4 మీటర్ల సెడాన్ ను కలిగి ఉండి 23.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2024 ఏడాది జూన్ లో మార్కెట్లలోకి రాబోతున్న డిజైర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

Written By: , Updated On : March 19, 2024 / 04:43 PM IST
Maruthi Desire Ev car

Maruthi Desire Ev car

Follow us on

Maruti Suzuki Dizer : దేశంలో మారుతి కొర్లు దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి ఏ మోడల్ వచ్చినా అందులో కొత్తదనం ఉంటుందని వినియోగదారుల అభిప్రాయం. మారుతి కంపెనీ సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుంగా కొత్త కొత్త కార్లను తీసుకొస్తుంది. కొన్ని పాతవాటిని అప్డేట్ చేస్తూ అందిస్తోంది. మారుతి నుంచి ఇప్పటికే మార్కెట్లో ఉన్న డిజైర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మోడల్ ఎక్కువగా విక్రయాలు జరుపుకుంది. ఇప్పుుడు డిజైర్ కొత్త ఎలక్ట్రిక్ SUV విభాగం నుంచి రిలీజ్ కాబోతుంది. ఈ కారు వివరాల్లోకి వెళితే..

కొత్త మారుతి డిజైర్ ఆకర్షించే లుక్ లో కనిపించబోతుంది. ఈ కారు లోపలి విభాగం పరిశీలిస్తే 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక డోర్ హ్యాండిల్స్ అప్ డేట్ చేయబడిన సైడ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇందులో కొత్త టెయిల్ గేట్, ఎల్ ఈడీ టెయిల్ ల్యాంపులు ఉన్నాయి. నూతన క్యాబిన్, కొత్త ఫ్రాంక్ లు తో మారుతి పాత డిజైర్ లాగే కనిపిస్తుంది. కానీ నల్లని రంగులో ఉండే డిజైర్ పై పెద్ద గ్రిల్ ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంపులను అమర్చారు.

కొత్త డిజైర్ ఇన్నర్ స్పెషిఫికేషన్ లోకి విషయానికొస్తే ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఇంకా ఇందులో అప్డేట్ చేయబడిన స్విచ్ గేర్ ఆకర్షిస్తుంది. ఈ సెడాన్ లోని హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటో డిమ్మింగ్ ఐఆర్ వీఎమ్, సెమీ డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ కన్సోల్, రియర్ ఏసీ ఉన్నాయి.

కొత్త డిజైర్ ఇంజిన్ 1.2 లీటర్ 3 సిలిండర్ డాక్ జడ్ సిరీస్ ను కలిగి ఉంది. ఇది 5700 ఆర్పీఎం వద్ద 82 బీహెచ్ పీ పవర్, 4500 ఆర్పీఎం వద్ద 108 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సబ్ 4 మీటర్ల సెడాన్ ను కలిగి ఉండి 23.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2024 ఏడాది జూన్ లో మార్కెట్లలోకి రాబోతున్న డిజైర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. దీనిని రూ.12 లక్షల నుంచి విక్రయించే అవకాశాలు ఉన్నాయి.