Spinach Benefits: మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం పాలకూర తింటే చాలు

Spinach Benefits: మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ఆకుకూరలు ముందు ఉంటాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, తుంటికూర లాంటివి మనకు అందుబాటులో ఉంటాయి. ఇందులో తోటకూర ప్రధానమైనది. తరువాత స్థానంలో పాలకూర ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ ఉండటంతో పాటు తక్కువ కేలరీల శక్తి ఉంటుంది. అందుకే పాలకూరను తరచుగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అందుకే రోజువారీ […]

Written By: Srinivas, Updated On : February 17, 2023 5:52 pm
Follow us on

Spinach Benefits

Spinach Benefits: మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ఆకుకూరలు ముందు ఉంటాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, తుంటికూర లాంటివి మనకు అందుబాటులో ఉంటాయి. ఇందులో తోటకూర ప్రధానమైనది. తరువాత స్థానంలో పాలకూర ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ ఉండటంతో పాటు తక్కువ కేలరీల శక్తి ఉంటుంది. అందుకే పాలకూరను తరచుగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో పాలకూర ఉంచుకోవడం మంచిదే. దీంతో మన ఆరోగ్యానికి కూడా రక్షణ కలుగుతుంది.

అనారోగ్య సమస్య నుంచి..

పోషకాల గని తోటకూర తరువాత స్థానంలో పాలకూర ఉంటుంది. మనకు కలిగే అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. పాలకూర రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు తొలగుతాయి. పాలకూర తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇది తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు వస్తాయని ఓ అపోహ ఉంది. కానీ అందులో నిజం లేదు. పాలకూర ఉడికించడం వల్ల అలాంటి అవకాశం ఉండదని వైద్యులే చెబుతున్నారు. పాలకూరలో అనేక రకాల పోషకాలు నిండి ఉండటం వల్ల దీన్ని తీసుకోవడం ఉత్తమమే.

పాలకూరలో విటమిన్లు

పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె తోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ ఉండటం వల్ల అనారోగ్యాలను దూరం చేస్తుంది. పాలకూర తినడం వల్ల క్యాన్సర్ నుంచి ఉపశమనం దొరుకుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తహీనత రాకుండా చేస్తుంది. అలర్జీలను రాకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తుంది. పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Spinach Benefits

మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన వారు పాలకూరను తినకూడదు. ఇందులో ఉండే ఆక్సాలిన్ మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి కారణమవుతుంది. పాలకూరను మూత్రపిండాల సమస్య ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్న వారు దీన్ని ఎక్కువగా తినకూడదు. మూత్రపిండాల జబ్బులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలున్న వారు పాలకూరను తినకుండా మానేయడమే శ్రేయస్కరం. పాలకూరను కొందరు తీసుకోవాలి. ఇంకా కొందరు మానేయాలి.

 

Tags