
Health Risks Of Mobile Phones: ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా మరో కొత్త రోగం వెలుగులోకిఇటీవల కాలంలో మొబైల్ వాడకం పెరిగింది. ప్రతి వారు ఎప్పుడు కూడా ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. యూ ట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో బిజీగా గడుపుతున్నారు. గంటల కొద్దీ ఫోన్ తో టైంపాస్ చేస్తూ పలు రకాల వ్యాధులకు దగ్గరవుతున్నారు. ఫలితంగా ఎన్నో రోగాలకు నిలయంగా మారుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. ఇంకా రాత్రుళ్లు కూడా ఫోన్లలోనే ఉంటున్నారు. ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
తరచుగా ఫోన్ వాడకంతో..
తరచుగా ఫోన్ చూడటం వల్ల టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇరవై నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్లు చూస్తూనే ఉంటున్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇదే తరహాలో నడుచుకోవడం గమనార్హం. మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా వాడుతున్నారు. ఫోన్ లో నెట్ ఉంటే చాలు ఏదో ఒక సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. దీంతో ఫోన్ ను విడవకుండా చేతిలోనే పెట్టుకుని చూస్తున్నారు.
ఎన్నో నొప్పులకు కేంద్రంగా..
తలనొప్పి, భుజాల నొప్పి, నిద్రలేమి, మానసిక అశాంతి లాంటి ఎన్నో సమస్యలకు ఫోన్లు కారణమవుతున్నాయి. అయినా మొబైల్ వినియోగం మానడం లేదు. ఎప్పుడు చేతిలోనే ఫోన్ ఉంచుకుని మరీ కళ్లకు, మెదడుకు పని చెబుతున్నారు. తదేకంగా చూడటం వల్ల వీటిపై పెను ప్రభావం పడుతోంది. దీంతో మొబైల్ వినియోగం తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఏడాది కాలంగా ఫోన్ అదే పనిగా చూడటం వల్ల తన కళ్లపై ప్రభావం పడి చూపు కోల్పోయే స్థితికి వెళ్లినా ఎవరు కూడా దీన్ని అంతగా పట్టించుకోవడం లేదు.

వాకింగ్ చేస్తే..
మొబైల్ వినియోగం తగ్గించుకోవడం మంచిది. ప్రతి రోజు ఓ గంట వాకింగ్ చేయాలి. తరువాత యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పెయిన్ కిల్లర్లు వాడే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వినియోగం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటి వినియోగం మరింత పెరుగుతోంది. వైద్యులు మాత్రం ఫోన్ల వాడకంతో సమస్యలే వస్తాయని చెబుతున్నారు. ఫోన్ వినియోగాన్ని తగ్గించుకుని మనకు నష్టాలు రాకుండా చూసుకోవాలి. భవిష్యత్ లో ఏర్పడే ముప్పును తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
