https://oktelugu.com/

కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి ఇప్పటికే ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా మరో కరోనా కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కళ్లలో దురద ఉన్నా మంట ఉన్నా కరోనా సోకినట్టే అని చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 12:10 pm
    Follow us on

    Corona Virus
    దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారికి సంబంధించి ఇప్పటికే ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా మరో కరోనా కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కళ్లలో దురద ఉన్నా మంట ఉన్నా కరోనా సోకినట్టే అని చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

    Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?

    తరచూ కళ్లు దురద పెడుతున్నా, మంట పెడుతున్నా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని చెబుతున్నారు. అంగిలా రస్కిన్ యూనివర్శిటీ అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించింది. . బీఎంజె ఓపెన ఆప్తామాలజీ జనరల్‌ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురించబడ్డాయి. 83 మంది కరోనా బాధితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

    Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా.. అప్పటివరకు నో ఆల్కహాల్..?

    కరోనా సోకి కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నా చికిత్స చేయించుకోక పోతే కొన్ని సందర్భాల్లో కళ్లకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కరోనా సోకిన వారిలో శాస్త్రవేత్తలు లైట్ సెన్సివిటీని గుర్తించారు. కొంతమందిలో కరోనా లక్షణాలు కనిపించిన రెండు వారాల తరువాత ఈ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ కొందరు కరోనా కొందరు కరోనా రోగుల్లో కండ్ల కలక లాంటి సమస్యలు కనిపిస్తాయని వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    కళ్ల నుంచి నీరు కారుతున్న కరోనా కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కన్ను ఎర్రబారితే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలుపుతున్నారు.